మహబూబాబాద్ జిల్లా:ఏప్రిల్ 24ఆర్టీసీ బస్సు( RTC bus )లో సీటు కోసం కొట్టుకున్న మహాలక్ష్మి లను చూసాం కానీ ఇప్పుడు సీన్ రివర్స్ భార్యల సీటు కోసం ఇప్పుడు భర్తలు కొట్టుకు న్నారు.ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా( Mahabubabad ) తొర్రూరులో మంగళవారం సాయంత్రం జరిగింది.
తొర్రూరు నుంచి ఉప్పల్ X రోడ్డుకు బయల్దేరిన బస్సు లో పలువురు కర్చీఫ్లు వేసి సీట్లు అపుకున్నారు.అయితే ఒకరు ఆపుకొన్న సీటులో మరొకరు కూర్చోవ డంతో ఇద్దరు మహిళల మధ్య గొడవ మొదలైంది.
అది కాస్తా వారి భర్తలు చెప్పులతో కొట్టుకునే వరకు వెళ్లింది.కండక్టర్ ఫిర్యాదు తో పోలీసులు వారిని స్టేషన్ కు తరలించారు…