ఇటీవల కాలంలో చిన్న చిన్న సమస్యలే దారుణాలకు కారణం అవుతున్నాయి.కుటుంబ సభ్యులే నరరూప హంతకులుగా మారుతూ సమాజం ఎటు వెళ్తుందో అర్థం కాని పరిస్థితులు ఇవి.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇంట్లో జరిగే గొడవలతో ఓ భర్త తన భార్య పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన సంఘటన తుమకూరు ( Tumkur ) జిల్లాలోని ముద్దనెరళెకెరె గ్రామంలో తీవ్ర కలకలం రేపింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పుట్టపర్తి జిల్లా హిందూపురం తాలూకా పరిగి మండలం బిసగానపల్లికి చెందిన రామాంజినప్ప కు, ముద్దనెరళెకెరె గ్రామానికి చెందిన శాంతమ్మకు ( Shantamma ) 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.
వివాహం తర్వాత రామాంజినప్ప, ముద్దనెరళెకెరె లోనే కాపురం ఉంటూ ట్రాక్టర్ డ్రైవర్, స్కూల్ బస్సు డ్రైవర్ గా పనిచేసేవాడు.

వీరికి 8 నుంచి 12 సంవత్సరాల వయసు ఉండే ముగ్గురు ఆడపిల్లలు సంతానం.అయితే రామాంజినప్ప ( Ramanjinappa ) స్కూల్ బస్సు ను ప్రమాదానికి గురి చేయడంతో, యజమాన్యం రెండు నెలల జీతం ఇవ్వలేదు.ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి.
ఈ క్రమంలోనే సోమవారం రాత్రి భోజనం సమయంలో గొడవ జరిగింది.కాసేపటికి భార్య పిల్లలు భోజనం చేసి నిద్రిస్తున్న సమయంలో రామాంజినప్ప భార్యా పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి, ఇంటికి తాళం వేసి పారిపోయాడు.

మంటల్లో కాలిపోతున్న భార్య పిల్లలు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు తాళం పగలగొట్టి మంటలను ఆర్పి వేశారు.నలుగురిని ఆసుపత్రికి తరలిస్తే, అప్పటికే శాంతమ్మ తీవ్రంగా కాలిపోవడంతో ప్రాణాలు విడిచింది.ముగ్గురు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాలయ్యాయి.ఇద్దరు అమ్మాయిలు తుమకూరు జిల్లా ఆస్పత్రిలో, మరో అమ్మాయి బెంగుళూరు విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.మిడగెశి పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న రామాంజినప్ప కోసం గాలింపు జరిపి అరెస్టు చేశారు.







