అనంతపురం జిల్లాలోని ఆర్ట్స్ కళాశాల కామర్స్ లెక్చరర్ సుమంగళిపై భర్త హత్యాయత్నానికి పాల్పడ్డాడు.కామర్స్ డిపార్ట్‌మెంట్ నుంచి బయటకు వస్తున్న సుమంగళిపై భర్త పారేష్ కత్తితో దాడి చేసి గొంతు కోశాడు.
ఆతర్వాత, అదే కత్తి పట్టుకుని, కాలేజి బయట హల్చల్ చేశాడు.దీంతో కాలేజి విద్యార్థులు, స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.
విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.భర్త పారేష్ దాడిలో గాయపడిన సుమంగళిని తోటి లెక్చరర్లు చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.