అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్( Hunter Biden ) శుక్రవారం విడుదల చేసిన పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో తన తండ్రిపై విమర్శకులు చేస్తున్న దాడులతో ఆయన అధ్యక్ష పదవిని నాశనం చేయడానికి , తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.శాన్ఫ్రాన్సిస్కోలో( San Francisco ) వున్న బైడెన్ ఆర్ట్ స్టూడియోలో జరిగిన ఇంటర్వ్యూను హంటర్ స్నేహితుడు నిర్వహించాడు.
అయితే ఇది ఎప్పుడు రికార్డ్ చేయబడింది అనేది తేలియరాలేదు.విలాసవంతమైన జీవనశైలికి నిధులు సమకూరుస్తున్నప్పుడు పన్నులు చెల్లించడంలో విఫలమయ్యాడని హంటర్ బైడెన్‌పై అమెరికా న్యాయ శాఖ నేరారోపణలను నమోదు చేసిన తర్వాత ఈ ఇంటర్వ్యూ వెలుగులోకి రావడం గమనార్హం.
తుపాకీ కొనుగోలు సమయంలో మాదక ద్రవ్యాల వినియోగం గురించి అబద్ధం చెప్పినందుకు హంటర్ బైడెన్‌పై సెప్టెంబర్ 14న దాఖలు చేసిన నేరారోపణలపై గురువారం అభియోగాలు వచ్చాయి.అయితే ఈ కేసులో తాను నిర్దోషినని హంటర్ చెబుతున్నాడు.53 ఏళ్ల హంటర్. రిపబ్లికన్లు ప్రతినిధుల సభలో బైడెన్‌పై( President Joe Biden ) అభిశంసన విచారణ చేపట్టడానికి కారణమయ్యాడు.2009-17లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పాలనా కాలంలో బైడెన్ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించాడు.ఆ సమయంలో బైడెన్, అతని కుటుంబ సభ్యులు పలు విధాన నిర్ణయాల ద్వారా అక్రమంగా లబ్ధి పొందారని రిపబ్లికన్లు ఆరోపిస్తున్నారు.

హంటర్ బైడెన్ పన్ను చెల్లింపు విచారణల్లో న్యాయశాఖ సరిగా జోక్యం చేసుకోవడం లేదని హౌస్ రిపబ్లికన్లు మండిపడుతున్నారు.అయితే వైట్‌హౌస్, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్‌లు ఈ ఆరోపణలను ఖండించాయి.ఇంటర్వ్యూలో హంటర్ మాట్లాడుతూ.తన భార్య గర్భవతిగా వున్నప్పుడు మాజీ అధ్యక్షుడు ట్రంప్( Donald Trump ) మద్ధతుదారులు తమ ఇంటి వెలుపల సంచారించారని చెప్పాడు.దీంతో తామిద్ధరం భయంతో ఇంటి నుంచి పరిగెత్తామని తెలిపాడు.వారు అత్యంత నీచమైన మార్గంలో తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని , అలాగే తన తండ్రి అధ్యక్ష పదవిని నాశనం చేసేందుకు చూస్తున్నారని హంటర్ దుయ్యబట్టారు.

కాగా.బైడెన్ రెండవసారి అధ్యక్షుడిగా వుండాలా , వద్దా అని అడిగితే ఆయన బరిలో నుంచి తప్పుకోవాలనే వాదనలు పెరుగుతున్నాయి.ఇందుకు ప్రధాన కారణం బైడెన్ వయసు.ఎన్నికలు జరిగే సమయానికి బైడెన్‌కు 81 ఏళ్లు వస్తే. రెండవసారి అధ్యక్షుడిగా గెలిచి దిగిపోయేనాటికి ఆయనకు 86 ఏళ్లు నిండుతాయి.దీనికి తోడు కాలిఫోర్నియాలోని పన్ను ఆరోపణలపై బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్‌పై నేరారోపణలు .అధ్యక్షుడికి అవకాశాన్ని మరింత క్లిష్టతరం చేసింది.







