బాపట్ల జిల్లా, చీరాల వాడరేవు సముద్ర తీరంలో మత్యకారుల వలకు భారీ తిమింగలం చిక్కింది.అయితే ఈ క్రమంలోనే మత్యకారులు వల నుంచి తిమింగలాన్ని వదిలించేందుకు మత్యకారుల నానా అవస్థలు పడ్డారు ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం కు చెందిన కొందరు మత్యకారులు రోజులగే వేట సాగిస్తుండగా ఈ భారీ తిమిగలం మత్యకారుల వలకు చిక్కింది.
పెద్ద మొత్తంలో మత్య సంపద దొరికిందని ఆనందపడిన మత్యకారులకు ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు.వెంటనే వలను పరిశీలించగా బారి తిమింగలని గుర్తించారు.
కాగా సముద్రంలో ఆ తిమింగలాన్ని వదిలించుకునేందుకు ఎంతో ప్రయత్నం చేసిన సాధ్యం కాలేదు.ఇక చేసేది లేక మత్యకారులు సమీపంలోని వాడరేవు తీరానికి చేరుకొని ఆ తిమింగలాన్ని వల నుంచి బయటకు తీసారు.
అప్పటికి ఆ తిమింగలం బతికే వుండటంతో అతి కష్టం మీద మత్యకారుల తిరిగి తిమింగలని సముద్రంలోకి తిరిగి వదిలేశారు.దీని బరువు సుమారు 2 వేల కిలోలు ఉండవచ్చని మత్స్యకారులు చెబుతున్నారు.
అయితే తిమింగలం ధాటికి మత్యకారుల వల పూర్తిగా ధ్వసం మైపోయింది.దీనితో సుమారుగా 30 వేల రూపాయల వరకు నష్టం వాటిలినట్లు మత్యకారుల తెలిపారు.







