ఒకవైపు చూస్తే తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడింది.మరో వంద రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువలనుంది.
దీంతో అధికార పార్టీ బీఆర్ఎస్( BRS party ) రాజకీయ వ్యూహాలతో ముందంజలో ఉండగా , కాంగ్రెస్ కూడా ఆ స్థాయిలోనే స్పీడ్ పెంచింది.ఈ రెండు పార్టీలు అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి .ఇప్పటికే ఎంపిక ప్రక్రియపైనే పూర్తిగా దృష్టి సారించాయి .జనాల్లోకి వెళుతూ జనాబలం పెంచుకునే ప్రయత్నాలు రెండు పార్టీలు ముమ్మరం చేశాయి.అయితే ఈ రేసులో బిజెపి వెనుకబడినట్లుగానే కనిపిస్తోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ లు అభ్యర్థులను ప్రకటించి దూకుడుగా ఉండగా , బిజెపి మాత్రం అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇంకా ఏ క్లారిటీకి రాలేదు .

దీంతో బీఆర్ఎస్ లోని కీలక నాయకులతో పాటు ఆశావాహుల్లోనూ ఆగ్రహం అసంతృప్తి మొదలైంది. తమకు కూడా అభ్యర్థులు ఎంపిక విషయంలో క్లారిటీ ఇవ్వకపోతే ఎలా అంటూ అధిష్టానం పై తెలంగాణ బిజెపి కీలక నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది.బలమైన బీ ఆర్ ఎస్, కాంగ్రెస్ లను ఎదుర్కొనేందుకు బిజెపి అధిష్టానం ఏ వ్యూహాలు పన్నుతోందో క్లారిటీ లేకపోవడంతో, తెలంగాణ బిజెపి నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.ప్రజా సమస్యలపై ఆందోళనలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహణకు బిజెపి ప్రత్యేకంగా 15 మంది సభ్యులతో కమిటీని వేసింది.
రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ నేతృత్వంలో ఈ కమిటీ ని ఏర్పాటు చేశారు .దీంట్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,( Komatireddy Rajagopal Reddy ) విజయశాంతి , వంటి వారు ఉన్నారు.మూడు విడతల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని ఈ కమిటీ నిర్ణయించుకుంది .ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టినా, అభ్యర్థుల ఎంపిక విషయంలోనే చాలా ఆలస్యం జరుగుతుందనే వాదన తెలంగాణ బిజెపి నేతల్లో నెలకొంది.

ఇప్పటికే కాంగ్రెస్ ( Congress party )స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తోంది .అభ్యర్థులు ఎంపిక చేస్తోంది.జాబితా విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.కానీ బిజెపి ఇంకా ధర్నాలు , ఆందోళన కార్యక్రమాలతోనే కాలక్షేపం చేస్తుండడం పై సొంత పార్టీ నేతల్లో నే అసంతృప్తి నెలకొంది.
బిజెపి( BJP party ) అగ్ర నేతల వ్యూహాలు ఏమిటో అర్థం కాక తెలంగాణ బిజెపి నాయకులు టెన్షన్ పడుతున్నారట.
.






