మరికొన్ని గంటల్లో ఆర్ఆర్ఆర్(RRR) మూవీకి ఆస్కార్ అవార్డ్ వచ్చే అవకాశాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే.కోట్ల సంఖ్యలో భారతీయుల కల నెరవేరడానికి ఎంతో సమయం పట్టదని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఆస్కార్ అవార్డ్ రావడానికి కొన్ని గంటల ముందు ఈ సినిమాకు ఊహించని షాక్ తగిలింది.రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి( Telugu states) థియేటర్లలో ఈ సినిమా రీరిలీజ్ అయింది.
అయితే ఆర్ఆర్ఆర్ మూవీ రీరిలీజ్(re-release) షోలకు ప్రేక్షకుల నుంచి కనీస రెస్పాన్స్ కూడా రావడం లేదు.చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన సినిమాకు ఇలాంటి రెస్పాన్స్ ఉంటుందని ఊహించలేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.
ఆర్ఆర్ఆర్ అవార్డ్( oscar award ) ముందు ఈ విధంగా జరగడం ఏంటని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.సరైన ప్రమోషన్స్ లేకపోవడం వల్లే సరైన రెస్పాన్స్ రాలేదని కొందరు చెబుతున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా రీరిలీజ్ అయినట్టు ఫ్యాన్స్ కు సైతం కనీస సమాచారం లేదని అందుకే ఈ విధంగా జరిగిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఆర్ఆర్ఆర్ మూవీకి నిర్మాతకు 200 నుంచి 300 కోట్ల రూపాయల రేంజ్ లో లాభం వచ్చింది.ఈ స్థాయిలో లాభాలను అందించిన మరో సినిమా ఈ మధ్య కాలంలో దాదాపుగా లేదు.ఈ సినిమా సక్సెస్ తో చరణ్, ఎన్టీఆర్ ఇమేజ్ ఒకేసారి పది రెట్లు పెరిగింది.

ఆస్కార్ అవార్డ్ వస్తే మాత్రం చరణ్, ఎన్టీఆర్ రేంజ్ మారిపోనుందని మరి కొందరు చెబుతున్నారు.చరణ్, ఎన్టీఆర్(ram charan) మధ్య స్నేహం ఎప్పటికీ కొనసాగాలని వాళ్లిద్దరూ కలిసి మరిన్ని సినిమాలలో నటించాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.ఆర్ఆర్ఆర్ మూవీకి ఆస్కార్ వస్తే ఈ సినిమా మరిన్ని అవార్డులను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.ఆర్ఆర్ఆర్ మూవీ ఇతర దేశాల ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది.







