నిన్నా , మొన్నటి వరకు బీఆర్ఎస్( BRS ) అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ( CM kcr ) పై అనేక అనుమానాలు, ప్రచారాలు జరిగాయి.కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు అని, అందుకే ఆయన ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారని, పార్టీ , ప్రభుత్వ కార్యక్రమాలు అన్నిటిని మంత్రి కేటీఆర్, ( KTR )హరీశ్ రావు, కవిత లు చక్కబెడుతున్నారు అని, తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది.
దీనికి తగ్గట్లుగానే కేసీఆర్ కూడా బయట కనిపించేవారు కాదు .తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల కావడంతో, కేసీఆర్ కథన రంగంలోకి దిగనున్నారు.ఈనెల 15 నుంచి నవంబర్ 9 వరకు మొత్తం 17 రోజుల్లో 41 బహిరంగ సభల్లో పాల్గొనాలని కేసీఆర్ నిర్ణయించారు.
నామినేషన్లు ప్రారంభమయ్యే నవంబర్ 3 వ తేదీలోపు కేసీఆర్ 26 బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ప్రత్యర్డి పార్టీలు ప్రచారంలోకి దిగేలోపే క్షేత్రస్థాయిలో పర్యటనలతో ప్రత్యర్ధి పార్టీల పై పైచేయి సాధించాలనే లక్ష్యంతో కేసీఆర్ ( CM kcr )ఉన్నారు .ఈనెల 15 బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫాంలు కేసిఆర్ స్వయంగా అందజేయనున్నారు .అదే రోజు సిద్దిపేట జిల్లా , హుస్నాబాద్ లో జరిగే బహిరంగ సభ నుంచి ఎన్నికల సమర శంకాన్ని పురించనున్నారు .తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తేదీ ప్రకటన తర్వాత జరిగే తొలి బహిరంగ సభ కావడంతో బీఆర్ఎస్ భారీ ఏర్పాట్లు చేస్తోంది.
ఈనెల 16 నుంచి వరుసగా కేసీఆర్ బహిరంగ సభల్లో పాల్గొనబోతుండడంతో , జన సమీకరణ పైన దృష్టి పెట్టింది.కాకపోతే పండుగల సమయంలో కాస్త విరామం ఇవ్వాలి అని నిర్ణయించారు.తెలంగాణలోని అన్ని జిల్లాల కంటే ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.మొదటి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ బలహీనంగా ఉండడంతో, ఈసారి వీలైనంత ఎక్కువ స్థానాలను ఇక్కడి నుంచి గెలవాలనే పట్టుదలతో ఉన్నారు.
ఈ మేరకు మంత్రులు కేటీఆర్, హరీష్( Harish Rao ) తదితరులు వీటిపై దృష్టి పెట్టారు.
.