సౌత్ స్టార్ హీరోయిన్ లలో నయనతార( Nayanthara ) ఒకరు.ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
నయన్ స్టార్ హీరోయిన్ గా మారిన తర్వాత బోల్డ్ నెస్ కు దూరంగా ఉంటూ కథాబలం ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటూ గ్లామర్ పాత్రలకు పూర్తిగా గుడ్ బై చెప్పింది.ఇక డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను( Director Vignesh Shivan ) ప్రేమించి కొన్నేళ్ల పాటు సహజీవనం చేసిన తర్వాత ఈ మధ్యనే పెళ్లి చేసుకుంది.
ఈయనతో పెళ్లి తర్వాత ఎన్ని కమర్షియల్ సినిమాల ఆఫర్స్ వచ్చిన రిజక్ట్ చేస్తూనే ఉంది.కోలీవుడ్ Kollywood) లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఈ అమ్మడు కేరాఫ్ అడ్రెస్ గా మారింది.
ఒకప్పుడు వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి వరుస హిట్స్ అందుకున్న ఈ భామ ఈ మధ్య హిట్స్ లేక ఫామ్ కోల్పోయింది.దీంతో మళ్ళీ వరుస హిట్స్ అందుకుని ఫామ్ లోకి రావాలని చూస్తుంది.
మరి అలాంటి హిట్టే ఈ అమ్మడి ఖాతాలో ఇప్పుడు పడింది.షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) హీరోగా నయనతార హీరోయిన్ గా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ( Atlee ) దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ”జవాన్”(Jawan).ఈ సినిమాతో ఈ అమ్మడు బాలీవుడ్ డెబ్యూతో అక్కడ అడుగు పెట్టింది.మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని అదిరిపోయే లెవల్లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమా విజయంతో ఈమెను బాలీవుడ్ లో నటింప జేయాలని దర్శక నిర్మాతలు చర్చలు జరుపుతున్నారట.ఈమె ఫేమ్ పెరగడంతో అక్కడ కూడా బిజీగా మారబోతున్నట్టు తెలుస్తుంది.అయితే ఈ అమ్మడు అక్కడ సినిమాలపై ఆచి తూచి జాగ్రత్తలు తీసుకుంటూ ముందు వెళుతుంది.ప్రజెంట్ తమిళ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు బాలీవుడ్ లో ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో చూడాలి.