కొన్ని సినిమాలు చూస్తే మనకు విపరీతంగా నచ్చుతాయి మరికొన్ని సినిమాలు చూస్తున్న కొద్ది చాలా బోర్ గా ఫీల్ అవుతూ ఉంటాం.అయితే ఒక సినిమా మనకు నచ్చింది అంటే దాన్ని రిపీటెడ్ గా చూస్తూనే ఉంటాం.
ఇక నచ్చని సినిమా ఒకసారి చూడటానికి కూడా మనకు ఇంట్రెస్ట్ ఉండదు అయితే ఇలాంటి సిచువేషన్ లో త్రివిక్రమ్( Director Trivikram ) డైరెక్షన్ లో వచ్చిన అన్ని సినిమాలని జనాలు రిపీటెడ్ గా చూడ్డానికి ఇష్టపడుతున్నారు.కానీ మిగతా డైరెక్టర్ల సినిమాలు సూపర్ సక్సెస్ అయినా సరే వాటిని ఒక్కసారి లేదా రెండుసార్లు కంటే ఎక్కువగా జనాలు చూడటానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.
అయితే ఇది తెలుసుకున్న కొంతమంది సినీ మేధావులు సైతం త్రివిక్రమ్ తన మాటల తూటాలతో తన సినిమాలను రిపీటెడ్ గా చూసేలా చేస్తున్నాడు అని అంటున్నారు.ఇక ఇప్పటికీ ఆయన సినిమాలు టీవీలో వచ్చిన కూడా చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ ఆ సినిమాలను చూస్తూ ఆదరిస్తున్నారు అలాగే వాటికి టిఆర్పి రేటింగ్స్ కూడా చాలా ఎక్కువగానే వస్తున్నాయి.ఇక ఆ విషయం పక్కన పెడితే ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబు( Mahesh Babu ) హీరోగా గుంటూరు కారం( Guntur Karam Movie ) అనే సినిమా తీస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలా నటిస్తుంది ఇక ఈ సినిమాతో మహేష్ బాబుకి కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టు ఇవ్వడానికి త్రివిక్రమ్ సర్వం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది.
ఇప్పటికే త్రివిక్రమ్ మహేష్ బాబు తో అతడు, ఖలేజా లాంటి సినిమాలు చేశాడు ఈ రెండు సినిమాలు కూడా యావరేజ్ గా నిలిచాయి.కానీ ఈ సినిమా మాత్రం బిగ్గెస్ట్ హిట్ కొట్టేలా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది.ఇక గుంటూరు కారం సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్ అందర్నీ ఆకట్టుకుంది.ఇక ఈ సినిమా పూర్తి అయితే మహేష్ బాబు నెక్స్ట్ రాజమౌళి( Rajamouli ) సినిమా మీదికి వెళ్ళిపోతాడు ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ అల్లు అర్జున్ హీరోగా ఇంకొక సినిమా చేస్తున్నాడు ఆ సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది…
.