టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్ట్ కావడం రాష్ట్రంలో ఎంతటి సంచలనాలకు తెర తీసిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.ఒక మాజీ సిఎం అవినీతి స్కామ్ లో అరెస్ట్ కావడం బహుశా ఏపీ రాజకీయా చరిత్రలోనే తొలిసారి కావడంతో దేశ వ్యాప్తంగా ఈ అంశం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.
అయితే చంద్రబాబు అరెస్ట్ కావడం వెనుక సరైన ఆధారాలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే.అరెస్ట్ జరిగిన విధానంపై మాత్రం చాలమంది ఏపీ ప్రభుత్వాన్ని ఖండిస్తున్నారు.
రిమాండ్ లో చంద్రబాబు పేరు లేకుండానే అరెస్ట్ చేయడం, మొదటి ఏ1 గా పరిగణించి ఆ తరువాత ఏ31 మార్చడం, పోలీసుల ఆడియో కాల్ లిస్ట్ ను బయటపెట్టక పోవడం వంటి పరిణామాలను దేశ వ్యాప్తంగా ముఖ్య నేతలంతా ఖండిస్తున్నారు.చంద్రబాబుకు మద్దతు ప్రకటిస్తున్నారు.
కానీ చంద్రబాబుకు సన్నిహిత బందువు టాలీవుడ్ టాప్ హీరో స్పందించకపోవడం పెను దుమరాన్ని రేపుతోంది.తన తాత స్వర్గీయ ఎన్టీ రామారావు స్థాపించిన టీడీపీకి ఎప్పుడు తన అవసరం వచ్చిన తాను మద్దతుగా ఉంటానని గతంలోనే ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చారు.కానీ ప్రస్తుతం చంద్రబాబు అరెస్ట్ కావడంతో టీడీపీ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది.ఇంతజరుగుతున్న ఎన్టీఆర్ మాత్రం విదేశీ టూర్ లో ఉంటూ కనీసం ట్వీట్ కూడా చేయకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అయితే ఎన్టీఆర్ ఉద్దేశ పూర్వకంగానే దూరంగా ఉంటున్నారనేది కొందరు విశ్లేషకులు చెబుతున్నా మాట.గతంలో నారా భువనేశ్వరి( Nara Bhuvaneshwari )ని అసెంబ్లీలో అవమానించినప్పుడు కూడా ఆచితూచి స్పందించారు ఎన్టీఆర్.ఇప్పుడు బాబు అరెస్ట్ అయినప్పటికి అసలు స్పందించడం లేదు.
అయితే ఎన్టీఆర్ స్పందించకపోవడానికి బలమైన కారణమే ఉన్నట్లు తెలుస్తోంది.చంద్రబాబుకు మద్దతుగా ఏమాత్రం స్పందించిన టీడీపీ ఎన్టీఆర్ యాక్టివ్ అయ్యారనే వాదన బలపడే అవకాశం ఉంది.అదే గనుక జరిగితే టీడీపీ ఫ్యూచర్ లీడర్ గా ఆ పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ ను చూస్తారు.
దీంతో నారా లోకేశ్, నందమూరి బాలకృష్ణ వంటి వారు ఎన్టీఆర్ నీడలోకి వెళ్ళే అవకాశం ఉంది.అందువల్ల మళ్ళీ కుటుంబ వివాదాలు భగ్గుమనే అవకాశం ఉంది.అందుకే ఎన్టీఆర్ వ్యూహాత్మకంగా మౌనం వహిస్తున్నారనేది కొందరి మాట.అయితే తాము ఎవరిని స్పందించమని ఆగడం అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చేనాయుడు ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.దీంతో పార్టీలోని కొందరు ఎన్టీఆర్ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారనేది మరికొందరి వాదన.మొత్తానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఏ మాత్రం స్పందించిన.టీడీపీలో అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.