ఈ విషయంలో మాత్రం మంచు మనోజ్‌ నిజమైన సూపర్‌ స్టార్‌

హీరోగా మంచు మనోజ్‌ ఇప్పటి వరకు కమర్షియల్‌ సక్సెస్‌లను దక్కించుకోవడంలో విఫలం అయ్యాడు.

కాని ఆయన రియల్‌ లైఫ్‌ హీరోగా మాత్రం ఎప్పటికప్పుడు పేరు దక్కించుకుంటూనే ఉన్నాడు.

ఈయన చేస్తున్న సినిమాల్లో ఎలా హీరోగా మంచి పనులు చేస్తూ ఉంటాడో రియల్‌ లైఫ్‌లో కూడా ఆపదలో ఉన్న సమయంలో ఆదుకునేందుకు ముందు ఉంటాడు.అలాగే అన్ని విధాలుగా కూడా సాయం చేసేందుకు నేనున్నాడు అంటూ ముందుకు వస్తాడు.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తూ ఉంటే మంచు మనోజ్‌ తన వంతు సాయం అన్నట్లుగా ముందుకు వచ్చాడు.కరోనా నుండి దూరంగా ఉండేందుకు ప్రతి రెండు గంటలకు ఒకసారి అయినా చేతులను శానిటైజర్స్‌తో కడుక్కోవాల్సి ఉంటుంది.

కాని కొందరు పేదవాళ్లు శానిటైజర్స్‌ను కొనుగోలు చేయలేరు.అలాగే వారు మాస్క్‌లు కూడా అవగాహణ లేకపోవడంతో కొనుక్కోవడం లేదు.

Advertisement
Https Telugustop Com Wp Content Uploads 2020 03 Manchu Manoj Give The Masks And

అందుకే మంచు మనోజ్‌ అలాంటి వారి కోసం ముందుకు వచ్చాడు.

Https Telugustop Com Wp Content Uploads 2020 03 Manchu Manoj Give The Masks And

ఎవరైతే శానిటైజర్స్‌ను కొనుగోలు చేయలేరో వారి కోసం ఫ్రీగా వేలాది శానిటైజర్స్‌ను ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.దాదాపుగా ఇందుకోసం పది లక్షల రూపాయలను ఆయన ఖర్చు చేస్తున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

అంతా కూడా వీడియోలు చేసి జాగ్రత్తగా ఉండండి అంటూ చెబుతున్నారు తప్ప ఇలా మంచు మనోజ్‌లా ముందుకు వచ్చి సాయం చేసేందుకు మాత్రం సిద్ద పడలేదు.అందుకే మంచు మనోజ్‌ నిజమైన సూపర్‌ స్టార్‌ అంటున్నారు.

మజాకా వల్ల సందీప్ కిషన్ కెరియర్ సెట్ అవుతుందా..?
Advertisement

తాజా వార్తలు