తక్కువ బడ్జెట్లో విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని హెచ్ పీ కంపెనీ కొత్త ల్యాప్ టాప్ హెచ్ పీ క్రోమ్ బుక్ 15.6( HP Chromebook 15.6 ) ను మార్కెట్లో విడుదల చేసింది.ఇది రెండు రంగులలో అందుబాటులో ఉంటూ, గేమ్ కి కూడా మంచి సపోర్ట్ చేస్తుంది.
ప్రస్తుతం ఆన్లైన్ లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది.ఈ ల్యాప్ టాప్ కంపెనీ ధర రూ.28,999 గా ఉంది.స్కూల్ , కాలేజ్ విద్యార్థులకు, వివిధ రకాల కోర్సులు నేర్చుకునే వారికి ఈ ల్యాప్ టాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కంపెనీ తెలిపింది.
చదువుకునే విద్యార్థులకు కనెక్టివిటీ, ప్రోడక్టివిటీ పెంచేందుకు వీలుగా దీనిని డిజైన్ చేశారు.వెనుకబడిన యువ విద్యార్థులకు, ఎంతో ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది.

ఈ ల్యాప్ టాప్ స్పెసిఫికేషన్స్( Specification ) చూస్తే ఇందులో ఇంటెల్ సెలెరొన్ ఎన్ -4500 ప్రాసెసర్, 15.6 ఇంచుల హెచ్డి స్క్రీన్, 250 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఫ్రీగా గూగుల్ అసిస్టెంట్, వీడియో కాల్స్ కోసం వైట్ డిజైన్ హెచ్డి కెమెరా, ఫైల్స్ పంపించడానికి హెచ్ పి క్విక్ డ్రా ఫెసిలిటీ లతో ఉంది.

మైక్రోసాఫ్ట్ 365 సపోర్ట్( Microsoft 365 Support ), 11 గంటలు నిరంతరంగా పనిచేసే బ్యాటరీ, హైబ్రిడ్ వర్క్ వెసులుబాటు గా తయారుచేశారు.27% అదనంగా లాడ్జ్ ట్రాక్ ప్యాడ్ ఫీచర్, పాస్టర్, స్మార్టర్ లెర్నింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్లతో విద్యార్థులను ఆకట్టుకోవడం కోసం ప్రత్యేకంగా కంపెనీ దీనిని తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేసింది.ఎలక్ట్రానిక్ రంగంలో కంపెనీల మధ్య పోటీ కారణంగా, తక్కువ బడ్జెట్ లోనే స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు మార్కెట్లోకి విడుదల అవుతూ, మధ్యతరగతి కొనుగోలుదారులకు ఆకర్షిస్తున్నాయి.చదువుకునే విద్యార్థులతో పాటు, ఉద్యోగ ప్రయత్నంలో ఉండే వారికి ఇదే మంచి అవకాశం త్వరపడండి.







