ప్రపంచ దేశాల్లోనే భారత్( India ) కు ప్రత్యేకత ఉంది.అనేక నాగరికతలు ఇక్కడ నుంచి ప్రారంభమయ్యాయి.
ఎంతో పురాతన చరిత్ర భారత్ కు ఉంది.ఎన్నో సంప్రదాయాలు, కట్టుబాట్లు ఇక్కడ పుట్టాయి.
వాటిని ప్రపంచదేశాలు కూడా పాటిస్తున్నాయి.వెయ్యి ఏళ్ల క్రిందటే భారతదేశ చరిత్ర ప్రారంభమైందని చెప్పడానికి పలు ఆధారాలు ఉన్నాయి.
పాతకాలంలో కేవలం ఆహారం కోసం మాత్రమే పనిచేసేవారు.ఆహారాన్ని సంపాదించుకునేందుకు కష్టపడేవారు.
ఇందుకోసం వ్యవసాయం చేసేవారు.కానీ అప్పట్లో వ్యవసాయం చేయడానికి పనిముట్లు లాంటివి లేవు.
దీంతో పంట తీయడానికి సంవత్సరమంతా కష్టపడేవారు.అయితే ఆ తర్వాత చిన్నచిన్నగా పనిముట్లు అందుబాటులోకి వచ్చాయి.

పనిముట్లు రావడం, ఆధునీకత పెరగడంతో ఆ తర్వాత ఏడాదికి రెండు పంటలు పండించేవారు.వరి, పత్తి లాంటివి ఎక్కువగా పండించేవారు.ఆ తర్వాత ఎద్దులను ఉపయోగించి వ్యవసాయం చేయడం, ఆ తర్వాత వివిధ వ్యవసాయ పనిముట్లు అందుబాటులోకి రావడంతో కొంత సలువు అయింది.అయితే ఇప్పుడు ప్రపంచంలో టెక్నాలజీ( Technology ) అనేది పెరిగిపోయింది.
అయినా కొన్ని కట్టుబాట్లు మాత్రమే అలాగే కొనసాగుతున్నాయి.వాటిలో ఒకటి వస్త్రధారణ.
అప్పటికీ, ఇప్పటికీ వస్త్రధారణలో ఎలాంటా మార్పులు రాలేదు.పాతకాలంలో మహిళలు చీరలు ధరించేవారు.
ఇప్పటికే మహిళలు చీరలు( Women sarees ) ధరిస్తున్నారు.

ఇక పురుషులు దోవతిని గోచిలా పెట్టుకునేవారు.పైన షర్ట్ ధరించేవారు.ఇప్పటికి కొంతమంది ఆ ఆచారాలను పాటిస్తున్నారు.
ఇక చిన్నపిల్లలు కూడా గోచిలాంటి దుస్తులను ధరించేవారు.ఇక అమ్మాయిలు రసజ్వల అయిన తర్వాత చీరను ధరించేవారు.
కానీ ఇప్పుడు విదేశీయుల మాయలో పడి చీరలను పక్కన పెట్టి డ్రెస్‌లను ధరిస్తున్నారు.ఇక పురాతన కాలంలో స్వయంగా పండించుకున్న ఆహారాన్ని తినేవారు.
ఇక పాతకాలంలో ఏమైనా జబ్బులు వస్తే ఆయుర్వేద పద్దతుల ద్వారా నయం చేసుకునేవారు.ఆడవిలో దొరికే వనమూలికలు, పసరు ద్వారా రోగాలను నయం చేసుకునేవారు.
ఇప్పటికీ ఆయుర్వేద పద్దతులను కొంతమంది పాటిస్తున్నారు.