ఉదయ్ కిరణ్.ఈ పేరు చెప్తే చాల మంది తెలుగు వారికి ఒక ఎమోషన్ వచ్చేస్తుంది.
ఉదయ్ కిరణ్ సినిమాల్లోకి కనుక రాకుండా ఉండి ఉంటె ఎక్కడో ఒక చోట జాబ్ చేసుకొని హ్యాపీ గా బ్రతికి ఉండేవాడు.ఈ సినిమా ఛత్రం లో ఇరుక్కొని అందులో నుంచి బయటకు రాలేక అక్కడ నెగ్గి లేక తనను తాను బలి తీసుకున్నాడు.
ఉదయ్ కి నటుడు అవ్వాలనే కోరిక ఉండటం తో పలు మోడలింగ్ ఏజెన్సీ లతో తన ఫోటోలు ఇచ్చేవాడు.అలా అహ్మద్ అనే ఒక మాడల్ కోఆర్డినేటర్ ఉదయ్ కిరణ్ ఫోటోలను దర్శకులకు చూపిస్తూ ఉండేవాడు .అయితే ఉదయ్ కిరణ్ ని తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం చేసింది మాత్రం దర్శకుడు తేజ.
అలా అని ఉదయ్ లాంటి వ్యక్తి కోసం తేజ వల వేసి పట్టుకోలేదు.పైగా చిత్రం సినిమాలో ఉదయ్ కిరణ్ పాత్ర కోసం చాల మందిని ట్రై చేసాక చివరికి ఎలాంటి అప్షన్ లేకపోవడం తో ఉదయ్ కిరణ్ ని ఫైనల్ చేసారు.చిత్రం సినిమా కోసం పూజ ముహూర్తం జరగడానికి ముందు రోజు రాత్రి వరకు హీరో ను మార్చేయాలని చిత్ర యూనిట్ బావిచింది.
చిత్రం సినిమా తీయాలని తేజ అనుకున్నప్పుడు నిర్మాత రామోజీ రావు గారు ఇచ్చిన బడ్జెట్ కేవలం నలభై లక్షలు.అందుకే ఆ సినిమాలో నటించే హీరో కోసం కేవలం 11 వేలు మాత్రమే రెమ్యునరేషన్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు.
అప్పుడు ఒక కొత్త హీరో కోసం వెతకడం ప్రారంభించగా అప్పుడు ఉదయ్ ని సెలెక్ట్ చేసుకున్నాడు .కానీ రామోజీ రావు కి ఉదయ్ కిరణ్ నచ్చలేదు.
అందుకోసం అంతకు ముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఒక వ్యక్తి హీరో గా పెట్టుకోవాలంటే 11 వేలు ఇస్తే చేయను అని వెళ్ళిపోయాడు.ఆ తర్వాత మరొక వ్యక్తిని కూడా తెచ్చిన పలు కారణాల వల్ల ఒకే కాలేదు.ఇక హీరోయిన్ విషయంలోనూ మొదట వేరే హీరోయిన్ అనుకున్నారు.రీమా సేన్ ఉదయ్ కి అక్కలాగా ఉంటుంది అని టీమ్ అంత చెప్పిన కూడా వినకుండా తేజ ఆమెనే ఫిక్స్ అయ్యాడు.
దాంతో ఉదయ్ కిరణ్ మరియు రీమా సేన్ ని ఫైనల్ చేసారు.శ్రీనగర్ కాలనీ లో షూటింగ్ మొదలయి అనుకున్న బడ్జెట్ లో పూర్తి చేయబడి పెద్ద సక్సెస్ కావడం తో ఉదయ్ మరియు రీమాసేన్ ఇద్దరు బిజీ ఆర్టిస్టులు అయ్యారు.