ఉమాంగ్ యాప్ తో ప్రభుత్వ సేవలను ఇలా వినియోగించుకోండి!

మీ ఫోన్లో ఉమాంగ్ యాప్( Umang App ) లేకపోతే వెంటనే దీనిని డౌన్లోడ్ చేసుకోండి.ఎందుకంటే, దీనివలన అన్ని ఉపయోగాలు ఉంటాయి మరి.

 How To Use Umang App And What Are Its Features Details, Umang, Application, Gove-TeluguStop.com

ఉదాహరణకు ఈపీఎఫ్వో సేవలు, గ్యాస్ బుకింగ్, ఇతర బిల్లుల చెల్లింపులతో పాటు అన్ని ప్రభుత్వ సేవలను ఈ ఒక్క ‘ఉమాంగ్ యాప్’ ద్వారా ఇపుడు పొందవచ్చు.అందరికీ తెలిసిందే, ఒకప్పుడు ఎలాంటి ప్రభుత్వ సేవ పొందాలన్నా సంబందిత ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది.

మనం తీరా పనులు వదులుకొని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లిన ఆ రోజు ఆఫీసర్స్ ఉంటారనే నమ్మకం వుండదు.దాంతో ఏదైనా పని పూర్తి కావడానికి రెండు మూడు రోజులు పట్టేది.

Telugu Aadhar, Central, Digilocker, Latest, Passportseva, Umang, Umang App-Lates

అయితే.నేడు అలాంటి పరిస్థితి లేదు.టెక్నాలజీ పెరిగాక ఎలాంటి పని అయినా నిమిషాల్లో జరిగిపోతోంది.ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం( Central Government ) సేవలను ప్రజలకు మరింతగా చేరువ చేయాలనే ఉద్దేశంతో ‘UMANG’ అనే యాప్ ప్రవేశపెట్టింది.

ఇది తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, కన్నడ ఇలా మొత్తం 13 స్థానిక భాషలలో అందుబాటులోకి తీసుకువచ్చింది.ఈ యాప్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సేవలన్నింటిన్నీ ఒకే ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చాయి.

రకరకాల యాప్లను డౌన్లోడ్ చేసుకుని ఇబ్బందులు పడే బదులు ఈ ఒక్క యాప్ మీ ఫోన్లో ఉంటే అనేక రకాల ప్రభుత్వ సేవలను పొందవచ్చు.

Telugu Aadhar, Central, Digilocker, Latest, Passportseva, Umang, Umang App-Lates

అన్ని యప్స్ మాదిరే దీనిని ప్లే స్టోర్( Play Store ) లోకి వెళ్ళి, డౌన్ లోడ్ చేసుకొని రిజిస్టర్ కావలసి వుంటుంది.ఈ ప్రక్రియ అందరికీ తెలిసిందే.ఈ యాప్‌తో వినియోగదారులు ఆధార్, DigiLocker, PayGovతో సహా అన్ని ప్రభుత్వ సంబంధిత సేవలు పొందవచ్చు.

పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు( Passport Seva Kendra ) ఎక్కడ ఉన్నాయో కూడా తనిఖీ చేయవచ్చు.ఇక ఈ యాప్ స్మార్ట్‌ఫోన్‌లకే పరిమితం కాలేదు.మీరు దీన్ని డెస్క్‌ టాప్, టాబ్లెట్ లేదా SMS ద్వారా కూడా ఉపయోగించవచ్చు.ఇంకో విషయం ఏమిటంటే ఉమాంగ్ ఒక ప్రత్యేక కస్టమర్ సపోర్ట్ టీమ్‌ను కలిగి ఉంది.ఆ సహాయక బృందం వారంలోని అన్ని రోజులలో ఉదయం 8.00 నుంచి రాత్రి 8.00 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube