ఉమాంగ్ యాప్ తో ప్రభుత్వ సేవలను ఇలా వినియోగించుకోండి!

మీ ఫోన్లో ఉమాంగ్ యాప్( Umang App ) లేకపోతే వెంటనే దీనిని డౌన్లోడ్ చేసుకోండి.

ఎందుకంటే, దీనివలన అన్ని ఉపయోగాలు ఉంటాయి మరి.ఉదాహరణకు ఈపీఎఫ్వో సేవలు, గ్యాస్ బుకింగ్, ఇతర బిల్లుల చెల్లింపులతో పాటు అన్ని ప్రభుత్వ సేవలను ఈ ఒక్క 'ఉమాంగ్ యాప్' ద్వారా ఇపుడు పొందవచ్చు.

అందరికీ తెలిసిందే, ఒకప్పుడు ఎలాంటి ప్రభుత్వ సేవ పొందాలన్నా సంబందిత ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది.

మనం తీరా పనులు వదులుకొని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లిన ఆ రోజు ఆఫీసర్స్ ఉంటారనే నమ్మకం వుండదు.

దాంతో ఏదైనా పని పూర్తి కావడానికి రెండు మూడు రోజులు పట్టేది. """/" / అయితే.

నేడు అలాంటి పరిస్థితి లేదు.టెక్నాలజీ పెరిగాక ఎలాంటి పని అయినా నిమిషాల్లో జరిగిపోతోంది.

ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం( Central Government ) సేవలను ప్రజలకు మరింతగా చేరువ చేయాలనే ఉద్దేశంతో 'UMANG' అనే యాప్ ప్రవేశపెట్టింది.

ఇది తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, కన్నడ ఇలా మొత్తం 13 స్థానిక భాషలలో అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఈ యాప్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సేవలన్నింటిన్నీ ఒకే ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చాయి.

రకరకాల యాప్లను డౌన్లోడ్ చేసుకుని ఇబ్బందులు పడే బదులు ఈ ఒక్క యాప్ మీ ఫోన్లో ఉంటే అనేక రకాల ప్రభుత్వ సేవలను పొందవచ్చు.

"""/" / అన్ని యప్స్ మాదిరే దీనిని ప్లే స్టోర్( Play Store ) లోకి వెళ్ళి, డౌన్ లోడ్ చేసుకొని రిజిస్టర్ కావలసి వుంటుంది.

ఈ ప్రక్రియ అందరికీ తెలిసిందే.ఈ యాప్‌తో వినియోగదారులు ఆధార్, DigiLocker, PayGovతో సహా అన్ని ప్రభుత్వ సంబంధిత సేవలు పొందవచ్చు.

పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు( Passport Seva Kendra ) ఎక్కడ ఉన్నాయో కూడా తనిఖీ చేయవచ్చు.

ఇక ఈ యాప్ స్మార్ట్‌ఫోన్‌లకే పరిమితం కాలేదు.మీరు దీన్ని డెస్క్‌ టాప్, టాబ్లెట్ లేదా SMS ద్వారా కూడా ఉపయోగించవచ్చు.

ఇంకో విషయం ఏమిటంటే ఉమాంగ్ ఒక ప్రత్యేక కస్టమర్ సపోర్ట్ టీమ్‌ను కలిగి ఉంది.

ఆ సహాయక బృందం వారంలోని అన్ని రోజులలో ఉదయం 8.00 నుంచి రాత్రి 8.

00 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.

కిరణ్ అబ్బవరం క సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతాడా..?