రెండు స్పూన్లు టీ పొడితో పొడవాటి ఒత్తైన జుట్టును పొందొచ్చు.. ఎలాగో తెలుసా?

ఉదయం లేవగానే ఒక కప్పు టీ తాగే అలవాటు మ‌న‌లో చాలా మందికి ఉంటుంది.టీతోనే తమ రోజును ప్రారంభించే వారు ఎందరో ఉన్నారు.

మితంగా తీసుకుంటే టీ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.పైగా ఉదయం ఒక కప్పు టీ( Tea ) తాగగానే ఫుల్ ఎనర్జిటిక్ గా మారుతుంటారు.

అయితే ఆరోగ్య పరంగా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి అన్నది పక్కన పెడితే.జుట్టు సంరక్షణకు మాత్రం టీ పొడి అద్భుతంగా సహాయపడుతుంది.

రెండు స్పూన్లు టీ పొడి తో పొడవాటి ఒత్తైన‌ జుట్టును పొందవచ్చు.అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ముందుగా ‌ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్‌ అయిన తరువాత అందులో రెండు టేబుల్ స్పూన్లు టీ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ మెంతి పౌడర్, నాలుగు నుంచి ఐదు లవంగాలు( Cloves ) వేసి మరిగించాలి.ఆల్మోస్ట్ పది నుంచి ప‌దిహేను నిమిషాల వరకు వాటర్ ను బాయిల్ చేసి స్ట‌వ్‌ ఆఫ్ చేసుకోవాలి.

ఇప్పుడు స్ట్రైనర్ సహాయంతో మరిగించిన నీటిని ఫిల్టర్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి.గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి ఒక స్ప్రే బాటిల్ లో నింపుకోవాలి.

ఆపై స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఈ విధంగా కనుక చేస్తే హెయిర్‌ ఫాలో కంట్రోల్( Hairfall Control ) అవుతుంది.జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరగడం ప్రారంభం అవుతుంది.స్కాల్ప్ హైడ్రేటెడ్ గా ఉంటుంది.

శోభన్ బాబు కలర్ గురించి జయలలిత తల్లి అలా అన్నారా.. అసలేం జరిగిందంటే?
ప్రశాంత్ వర్మ లాంటి డైరెక్టర్ ఇండస్ట్రీలో మరొకరు లేరా..? ఆయనకి ఎందుకంత క్రేజ్...

చుండ్రు మొత్తం తొలగిపోతుంది.అలాగే టీ పౌడర్ ను పైన చెప్పిన విధంగా వాడితే తెల్ల జుట్టు త్వరగా రాకుండా ఉంటుంది.

Advertisement

జుట్టు హెల్తీ గా షైనీ గా సైతం మెరుస్తుంది.

తాజా వార్తలు