ఆప్రికాట్ పండు ఆరోగ్యానికే కాదు.. ఇలా కూడా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని తెలుసా?

ఆప్రికాట్ పండ్లువీటి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.నారింజ లేదా పసుపు రంగులో ఉండే ఆప్రికాట్లు.

చ‌క్కటి రుచితో పాటు బోలెడ‌న్ని పోష‌క విలువ‌ల‌ను క‌లిగి ఉంటాయి.అందుకే ఇవి ఆరోగ్య ప‌రంగా అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.

అలాగే చ‌ర్మ సౌంద‌ర్యానికీ ఆప్రికాట్లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.వివిధ ర‌కాల చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను నివారిస్తాయి.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆప్రికాట్ల‌ను చ‌ర్మానికి ఏ విధంగా వాడాలి.? అస‌లు వాటి వ‌ల్ల వ‌చ్చే స్కిన్ కేర్ బెనిఫిట్స్ ఏంటీ.? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం ప‌దండీ.ముడ‌త‌లుఎంద‌రినో వేధించే చ‌ర్మ స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి.

Advertisement
How To Use Apricots For Skin Apricots, Skin Care, Skin Care Tips, Beauty, Beaut

అయితే ముడ‌త‌ల‌ను నివారించి చ‌ర్మాన్ని య‌వ్వ‌నంగా మార్చ‌డంలో ఆప్రికాట్లు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.అందుకోసం రెండు గింజ తొల‌గించిన ఆప్రిక‌ట్ల‌ను మిక్సీ జార్‌లో వేసి మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.

ఈ పేస్ట్‌లో వ‌న్ టేబుల్ స్పూన్‌ బాదం ఆయిల్‌, వ‌న్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని.

ప‌ది నిమిషాల పాటు ఆర‌నివ్వాలి.అనంత‌రం సున్నితంగా వేళ్ల‌తో మ‌సాజ్ చేసుకుంటూ శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఇలా రెండు రోజుల‌కు ఒక‌సారి చేస్తే ముడ‌త‌లు క్ర‌మంగా దూర‌మై ముఖం నిగారింపుగా మారుతుంది.

How To Use Apricots For Skin Apricots, Skin Care, Skin Care Tips, Beauty, Beaut
నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
నకిలీ రూ.500 నోట్లని ఇలా గుర్తించండి!

అలాగే రెండు బాగా పండిన ఆప్రికాట్ పండ్ల‌ను గొంజ తొల‌గించి మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.ఈ పేస్ట్‌లో రెండు టేబుల్ స్పూన్ల ఆరెంజ్ జ్యూస్‌, వ‌న్ టేబుల్ స్పూన్ శెన‌గ‌పిండి, వ‌న్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని అన్నీ క‌లిసేలా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసుకుని.

Advertisement

ఇర‌వై నిమిషాల పాటు ఆర‌బెట్టుకోవాలి.ఆపై వాట‌ర్‌తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఇలా త‌ర‌చూ చేస్తే మొటిమ‌లు, మ‌చ్చ‌లు తొల‌గిపోయి ముఖం అందంగా, గ్లోయింగ్ గా మారుతుంది.

తాజా వార్తలు