గుమ్మడి కాయల సాగులో పక్షి కన్ను తెగులను అరికట్టే పద్ధతులు..!

గుమ్మడికాయలు( Pumpkin ) ఆశించే పక్షి కన్ను తెగులు గ్లోమెరేళ్ళ లాగేనరిముమ్ అనే ఫంగస్ ( Fungus ) ద్వారా పంటను ఆశిస్తాయి.తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు ఈ ఫంగస్ గాలిలోకి బీజాంశాలను విడుదల చేస్తుంది.

 How To Treat Anthracnose On Pumpkin Crop Details, Anthracnose ,pumpkin Crop, Pum-TeluguStop.com

ఇవి నేలకు అతి దగ్గరగా ఉండే గుమ్మడికాయ తీగలపై, ఆకులపై ప్రభావం చూపించడం ప్రారంభిస్తాయి.తర్వాత ఆకులపై, గుమ్మడికాయలపై నీటితో తడిచి ఉన్న పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి.

ఈ మచ్చలను పక్షి కన్ను తెగులు అంటారు.

ఈ మచ్చలు ముందు పసుపు రంగులో ఏర్పడి క్రమంగా ముదురు గోధుమరంగు లేదా నలుపు రంగులోకి మారుతాయి.

ఎదుగుతున్న మొక్కల యొక్క ఆకుల కణజాలాన్ని( plant Cells ) పూర్తిగా దెబ్బతిస్తాయి.దీంతో చెట్లు ఎండిపోవడం ప్రారంభమవుతుంది.గుమ్మడికాయలపై గజ్జి లాంటి మచ్చలు ఏర్పడతాయి.

Telugu Agriculture, Anthracnose, Fertilizers, Fungus, Pumpkin Crop, Pumpkin-Late

ఈ తెగులు పంటను ఆశించకూడదు అంటే ముందుగా తెగులు నిరోధక రకాలైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి.ప్రతి సంవత్సరం దోస జాతి సంబంధిత పంటలు కాకుండా పంట మార్పిడి చేయడం తప్పనిసరి.పంట చేతికి వచ్చే సమయంలో పొలంలో పారిశుద్ధ్య సౌకర్యం అవసరం.

తేమ ఉన్న పొలంలో ఉపయోగించిన యంత్ర పరికరాలను మరొక పొలంలో ఉపయోగించకూడదు.

Telugu Agriculture, Anthracnose, Fertilizers, Fungus, Pumpkin Crop, Pumpkin-Late

ఈ తెగులను నివారించడానికి ముందుగా సేంద్రీయ పద్ధతిలో కాపర్ ఫార్ములేషన్ లను కుకుర్బిట్స్ పై వాడవచ్చు.ఒకవేళ ఈ తెగుల తీవ్రత అధికంగా ఉంటే ఆ సమయంలో రసాయన పిచికారి మందులను ఉపయోగించాలి.హెక్సా కొనజోల్ 5.0 EC ను లీడర్ నీటిలో కలిపి పంటకు పిచికారి చేయాలి.

ఒకవేళ ఫలితం కనిపించకపోతే క్లోరోతలోనిల్ 75.0wp ను ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి.లేదంటే కార్బెండిజం 50.0wp లేదా మాకోజెబ్ 75.0wp లలో ఏదో ఒక రసాయనాన్ని పిచికారి చేసి పక్షి కన్ను తెగులను నివారిస్తే నాణ్యత గల అధిక దిగుబడి పొందవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube