వర్షాభావంతో నష్టపోయిన రైతులకు పది వేల రూపాయలు ఆర్థిక సాయం..

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు రైతు దినోత్సవం సందర్భంగా రఘునాథపాలెం, రంక్యా తండా రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతు సంబరాల్లో ముఖ్య అతిథిగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు.తెలంగాణ( Telangana )లో ఇటీవల కురిసిన వడగళ్ల వానలు, అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలకు కేంద్రం సిఫారసుల కంటే అధికంగా ఎకరాకు రూ.10వేలు చొప్పున సహాయ, పునరావాస సాయాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించారని ఆయా సాయం నేటి నుండి రైతులకు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.

 Financial Assistance Of Ten Thousand Rupees To Farmers Who Have Lost Due Heavy R-TeluguStop.com

రాష్ట్ర వ్యాప్తంగా వర్షాభావంతో నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్( CK KCR ) రూ.228 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించడం ఒక్క కేసీఅర్ గారికే సాధ్యమన్నారు.రఘునాథపాలెం మండలంలో తండాలను గ్రామ పంచాయతీలుగా చేసుకున్నామని పేర్కొన్నారు.రూ.20 కోట్లతో సుడా పార్క్ పక్కనే పేదల ఉచిత నాణ్యమైన విద్యబ్కోసం స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ను నిర్మిస్తున్నామని అన్నారు మండల ప్రజలకు కళ్యాణ లక్ష్మి, షాది ముభారక్, ఆసరా పెన్షన్లు, రైతు బందు, రైతు భీమా( ), ఉచిత విద్యుత్, రైతులకు ఎరువులు, డబుల్ బెడ్ రూం ఇల్లు, విత్తనాలు, చెరువుల్లో ఉచిత చేప పిల్లల పంపిణీ ఇలా అనేక పథకాలు విరివిగా అందించిన ఘనత మన BRS ప్రభుత్వందే అన్నారు.ఇవన్నీ మళ్ళీ మనకు అందాలంటే మళ్ళీ కేసీఅర్ గారిని, ఇక్కడ నన్ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.ఇప్పటికీ వరకు అద్భుతమైన అభివృద్ది చేసుకున్నాం ఇక చేయాల్సింది రాజకీయాలే అని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube