పొరపాటున కూరలో ఉప్పు, కారం ఎక్కువైందా... ఇలా చేస్తే ఉప్పు, కారం తగ్గి వంట రుచి పెరుగుతుంది

కూరలో ఉప్పు, కారం ఎక్కువైతే.మనం కూరలు తయారుచేసినప్పుడు ఒక్కోసారి పొరపాటున ఉప్పు గాని కారం గాని ఎక్కువ అవవచ్చు.

అలాంటి సమయంలో కంగారు పడవలసిన అవసరం లేదు.సింపుల్ చిట్కా పాటిస్తే ఎక్కువ అయిన ఉప్పు, కారం తగ్గిపోతాయి.

మైదా ముద్దను కూరలో ఉడుకుతున్న సమయంలో వేస్తె ఎక్కువైనా ఉప్పు, కారంలను పీల్చుకొని కూరలో ఉప్పు, కారం తగ్గుతాయి.అలాగే మరొక చిట్కా కూడా ఉంది.

బంగాళాదుంపను చెక్కు తీసి సగానికి కోసి ఆ ముక్కను కూరలో వేస్తే ఎక్కువగా ఉన్న ఉప్పు, కారంలను పీల్చుకొని కూరలో ఉప్పు,కారం తగ్గేలా చేస్తుంది.పుల్కాలు మెత్తగా ,మృదువుగా రావాలంటే.

Advertisement
How To Reduce Salt And Chilli Powder In Curry Details, Salt, Chilli Powder, Tast

పుల్కాలు లేదా చపాతీ ఉదయం చేస్తే మధ్యాహ్నం అయ్యేసరికి మృదువుగా లేకుండా రబ్బర్ లా సాగుతూ ఉంటుంది.పుల్కా మెత్తగా మృదువుగా రావాలంటే పిండి కలిపే సమయంలో నూనె, పంచదార, పాలు వేయాలి.

ఈ విధంగా చేసుకుంటే ఉదయం చేసిన పుల్కా సాయంత్రానికి కూడా మెత్తగా, మృదువుగా ఉంటుంది.బిర్యానీ ముద్దగా కాకుండా పొడిపొడిగా రావాలంటే.

మనం హోటల్ కి వెళ్ళినప్పుడు పొడిపొడిగా ఉండే బిర్యానీ తింటూ ఉంటాం.

How To Reduce Salt And Chilli Powder In Curry Details, Salt, Chilli Powder, Tast

అదే మన ఇంటిలో తయారుచేస్తే ఆలా రాదు.ఆలా రావాలంటే మంచి క్వాలిటీ ఉన్న బాసుమతి బియ్యాన్ని తీసుకోవాలి.బిర్యానీ చేసేటప్పుడు ఒక కప్పు బాసుమతి బియ్యానికి ఒక కప్పు నీటిని మాత్రమే పోయాలి.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
దోమలు దూరంగా పారిపోవాలంటే ఈ మొక్కలను పెంచుకోండి

ఈ రెండు చిట్కాలను పాటిస్తే హోటల్ మాదిరిగా బిర్యానీ పొడిపొడిగా వస్తుంది.నూడిల్స్ ముద్ద అవ్వకుండా ఉండాలంటే.సాధారణంగా నూడిల్స్ చేసినప్పుడు ముద్ద అవ్వటం సహజమే.

Advertisement

అయితే హోటల్ లో మాత్రం నూడిల్స్ పొడిగా ఉంటుంది.మనకు కూడా ఆలా పొడిగా రావాలంటే నూడిల్స్ ఉడికించి సమయంలో కొంచెం నూనె వేయాలి.90 శాతం ఉడికిన తర్వాత పొయ్యి మీద నుంచి దించేయాలి.పొయ్యి మీద నుంచి దించాక నీటిని తీసేసి కొంచెం నూనె వేసి కలిపితే నూడిల్స్ పొడిగా ఉంటాయి.

తాజా వార్తలు