వింట‌ర్‌లో హార్ట్ ఎటాక్ రిస్క్ చాలా ఎక్కువ‌..ఎందుకో తెలుసా?

వింట‌ర్ సీజ‌న్ ప్రారంభ‌మైంది.ఈ సీజ‌న్‌లో జలుబు, ఫ్లూ జ్వరాలు, ద‌గ్గు, గొంతు నొప్పి వంటి స‌మ‌స్య‌లే కాదు.

గుండె పోటు మ‌రియు ఇత‌ర గుండె సంబంధిత జ‌బ్బులు వ‌చ్చే రిస్క్ కూడా ముప్పై శాతం ఎక్కువగానే ఉంటుంది.వింట‌ర్ సీజ‌న్‌లో వాతావ‌ర‌ణ ఉష్ణోగ్ర‌త ప‌డి పోవ‌డం వ‌ల్ల చ‌లి తీవ్రంగా ఉంటుంది.

ఆ చ‌లి కార‌ణంగా గుండెపై ఒత్తిడి ప‌డుతుంది.రక్తనాళాలు కుచించుకుపోతాయి.

ర‌క్త పోటు స్థాయిలు ప‌డిపోతాయి.గుండెకు ఆక్సిజన్‌ సరఫరా కూడా త‌గ్గి పోతుంది.

Advertisement
How To Prevent Heart Attack In Winter? Winter, Heart Attack, Latest News, Health

అందు వ‌ల్ల‌నే.చ‌లి కాలంలో గుండె పోటు, ఇత‌ర గుండె సంబంధిత వ్యాధులు స‌క్ర‌మించే ప్ర‌మాదం పెరుగుతుంద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అయితే మ‌రి వింట‌ర్‌లో హార్ట్ డిసీజెస్‌కు దూరంగా ఉండాలంటే ఏం చేయాలి.? ఎటువంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.? వంటి విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.చ‌లి కాలంలో గుండెకు ముప్పు త‌గ్గాలంటే.

సూర్యకాంతి ఎంతో అవ‌స‌రం.ప్ర‌తి రోజూ ఉద‌యం ఇర‌వై నిమిషాల పాటు ఎండ‌లో ఉంటే విట‌మిన్ డి ల‌భించ‌డ‌మే కాదు గుండె ఆరోగ్యంగా మారుతుంది.

మ‌రియు ఇమ్యూనిటీ సిస్ట‌మ్ బ‌ల‌ప‌డుతుంది.

How To Prevent Heart Attack In Winter Winter, Heart Attack, Latest News, Health
నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

అలాగే సిగరెట్‌ స్మోకింగ్, ఆల్క‌హాల్‌, ఫాస్ట్ ఫుడ్స్‌, ఆయిలీ ఫుడ్స్‌, కూల్ డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి.కాఫీ, టీల‌కు బ‌దులుగా గ్రీన్ టీ, బ్లాక్ టీ మ‌రియు హెర్బ‌ల్ టీలు తీసుకోవాలి.త‌ద్వారా హై కొల‌స్ట్రాల్ క‌రిగి హార్ట్ హెల్తీగా మారుతుంది.

Advertisement

చ‌లి కాలంలో చాలా మంది వ్యాయామాల‌ను నిర్ల‌క్ష్యం చేస్తారు.అదే కొంప ముంచుతుంది.

గుండె జ‌బ్బులు ద‌రి చేర‌కూడ‌దంటే.రెగ్యుల‌ర్‌గా క‌నీసం ముప్పై లేదా న‌ల‌బై నిమిషాల పాటు వ్యాయామాలు చేయాలి.

చ‌లి అధికంగా ఉన్న‌ప్పుడు గుండెపై భారం ప‌డుతుంది.అందుకే శ‌రీర ఉష్టోగ్ర‌త‌లను పెంచుకునేందుకు ప్ర‌య‌త్నించాలి.సాక్స్, గ్లౌజులు వేసుకోవాలి.

వెచ్చని దుస్తులతో మిమ్మల్ని మీరు కప్పుకోవాలి.వేడి వేడి సూప్స్‌ను తీసుకోవాలి.

ఇక ఈ వింట‌ర్‌లో గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.అల్లం, వెల్లుల్లి, క్యారెట్‌, బీట్ రూట్‌, చేప‌లు, గుడ్లు, న‌ట్స్‌, సిట్ర‌స్ ఫ్రూట్స్‌, ఖ‌ర్జూరం, ఎండు ద్రాక్ష‌, బ్రకోలీ, కాలే, పాలకూర, తృణధాన్యాలు, ఓట్స్ వంటివి ఉండేలా చూసుకోండి.

తాజా వార్తలు