ఇంట్లో సింపుల్‌గా కాటుక‌ను ఎలా త‌యారు చేసుకోవ‌చ్చో తెలుసా?

కాటుక క‌ళ్ళు. ఎంత బ్రైట్‌గా, బ్యూటీఫుల్‌గా క‌నిపిస్తాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

పైగా కాటుక పెట్టుకోవ‌డం వ‌ల్ల దుమ్ము, ధూళి కణాలు కళ్ళలో పడకుండా ఉంటుంది.

కళ్ళకి కాటుక పెట్టుకోవడం వల్ల కంటిలోని ఎర్రటి చారలు తొలగిపోతాయి.

క‌ళ్ళ‌ మంట‌ల‌ను త‌గ్గించ‌డంలోనూ కాటుక‌ ఉప‌యోగ‌ప‌డుతుంది.మ‌రియు కాటుక వల్ల కళ్ళు పెద్దగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

అందుకే చాలా మంది అమ్మాయిలు ప్ర‌తి రోజు క‌ళ్ళ‌కు కాటుక‌ను పెట్టుకుంటారు.అయితే బయట దొరికే కాటుకల్లో ఎన్నో ర‌సాయ‌నాలు నిండి ఉంటాయి.

Advertisement

అందం విష‌యం ప‌క్క‌న పెడితే అటు వంటి కాటుక‌ల‌ను వాడ‌టం వ‌ల్ల కంటి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ తింటుంది.అందుకే ఇంట్లో త‌యారు చేసిన న్యాచుర‌ల్ కాటుక‌ల‌నే వాడాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

మ‌రి ఆల‌స్య‌మెందుకు ఇంట్లో సింపుల్‌గా మ‌రియు ఫాస్ట్‌గా కాటుక‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్‌లో బాదం పప్పుల్ని వేసి.

కాస్త ఎత్తులో కాప‌ర్ ప్లేట్‌ బోర్లించేలా అమర్చుకోవాలి.

ఆ త‌ర్వాత బాదం పప్పు ల‌ను మండిస్తే.పై ప్లేట్‌ అడుగు భాగంలో మందపాటి లేయర్‌లా మసి పేరుకు పోతుంది.ఆ మ‌సిని తీసుకుని కొబ్బ‌రి నూనెను యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటే కాటుక సిద్ధ‌మైన‌ట్టే.

ప్రతి వారం 5 గ్రాముల బంగారం.. మణికంఠ ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇదే!
ఎలాన్ మస్క్ కూడా కాపీ కొడతాడా.. ఆ డైరెక్టర్ సంచలన ఆరోపణలు..?

ఈ న్యాచుర‌ల్ కాటుక‌ను చిన్న డబ్బాల్లో పెట్టి స్టోర్ చేసుకుంటే రోజూ వాడుకోవ‌చ్చు.

Advertisement

ఇక మ‌రో విధంగా కూడా కాటుక‌ను త‌యారు చేసుకోవ‌చ్చు.ఒక నాలుగైదు చార్‌ కోల్‌ క్యాప్సూల్స్ తీసుకుని.అందులోని పౌడ‌ర్‌ను ఒక బౌల్‌లో వేసుకోవాలి.

ఇప్పుడు ఈ పౌడ‌ర్‌లో కొద్దిగా ఆముదం వేసి చిక్కటి పేస్ట్‌ అయ్యే వ‌ర‌కు క‌లుపుకుంటే కాటుక రెడీ అయిన‌ట్టే.దీన్ని చిన్న డబ్బాలో వేసుకోని ఎప్పుడు కావాల‌నుకుంటే అప్పుడు యూజ్ చేయ‌వ‌చ్చు.

తాజా వార్తలు