వినికిడి శ‌క్తి తగ్గుతోందా..? అయితే ఈ చిట్కాలు మీకోస‌మే!

వ‌య‌సు పెరిగే కొద్ది వినికిడి శ‌క్తి త‌గ్గ‌డం స‌ర్వ సాధార‌ణం.కానీ, ఇటీవ‌ల కాలంలో చిన్న వ‌య‌సు వారిలో సైతం ఈ స‌మ‌స్య క‌నిపిస్తోంది.

ఆహార‌పు అల‌వాట్లు, మారిన జీవ‌న శైలి, ఇయ‌న్ ఫోన్లు.బ్లూ టూత్‌కు ఓవ‌ర్‌గా యూజ్ చేయ‌డం, వైరల్‌ఇన్ఫెక్షన్, ప‌లు ర‌కాల మందుల వాడ‌కం, ప్రమాదాలలో చెవికి లేదా త‌ల‌కు దెబ్బ‌లు త‌గ‌ల‌డం, మ‌ధుమేహం.

ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల వినికిడి శ‌క్తి త‌గ్గుతూ ఉంటుంది.అయితే ఈ స‌మ‌స్య‌ను నివారించ‌డంలో కొన్ని కొన్ని చిట్కాలు అద్భుత‌మంగా స‌మాయ‌ప‌డ‌తాయి.

మరి ఆ చిట్కాలు ఏంటీ.? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

Hearing Problems, Hearing, Latest News, Ears, Health, Health Tips, Good Health
Advertisement
Hearing Problems, Hearing, Latest News, Ears, Health, Health Tips, Good Health-

ముల్లంగి ర‌సం.వినికిడి శ‌క్తిని పెంచ‌డంలో ఎఫెక్టివ్‌గా ప‌ని చేస్తుంది.అందు కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో అర క‌ప్పు ముల్లంగి ర‌సం, మూడు స్పూన్ల నువ్వుల నూనె వేసి ఐదు నుంచి ప‌ది నిమిషాల పాటు మ‌రిగించాలి.

ఆపై ఈ మిశ్ర‌మాన్ని చ‌ల్లార బెట్టుకుని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని ఉద‌యం, సాయంత్రం రెండు చుక్కలు చెవుల్లో వేసుకుంటే.వినికిడి శ‌క్తి క్ర‌మంగా పెరుగుతుంది.

అలాగే ఒక స్పూన్ వామును తీసుకుని వాట‌ర్ సాయంతో మెత్త‌టి పేస్ట్‌లా చేసుకోవాలి.ఇప్పుడు ఈ వాముకు పేస్ట్‌కు ఒక క‌ప్పు నువ్వుల నూనెను చేర్చి.

ప‌ది నిమిషాల పాటు వేడి చేయాలి.ఆపై చ‌ల్లార నిచ్చి.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

నూనెను వ‌డ‌బోసుకుని గాజు సీసాలో నింపుకోవాలి.ఇక ఈ నూనెను రోజుకి రెండు, మూడు చుక్కలు చెవిలో వేసుకుంటే.

Advertisement

వినికిడి లోపాల‌న్నీ ప‌రార్ అవుతాయి.

ఇక ఈ టిప్స్‌తో పాటుగా చెవుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు క్లీన్ చేసుకోవాలి.స్నానం చేసేట‌ప్పుడు వాట‌ర్ లోప‌లికి వెళ్ల‌కుండా జాగ్ర‌త్త ప‌డాలి.త‌ల స్నానం చేయ‌డానికి గంట ముందు చెవుల్లో గోరు వెచ్చ‌టి ఆలివ్ ఆయిల్‌ను రెండు చుక్క‌ల చ‌ప్పున వేసుకోవాలి.

మ‌రియు చెవిలో ఏదైనా ఇన్‌ఫెక్షన్ ఏర్ప‌డితే వెంట‌నే వైద్యుడిని సంప్ర‌దించి స‌రైన చికిత్స తీసుకోవాలి.

తాజా వార్తలు