ఎన్ఆర్ఐ పాన్ కార్డు ఇలా పొందండి!

How To Get Nri Pan Card Process And Documents Details Details, Nri, Pan Card, Viral Latest , Latest News, Tips, Process, Application, Apply, Apply Nri Pancard, Income Tax Department, Permanent Account Number,

ప్రస్తుతం ఆధార్ కార్డు, పాన్ కార్డు వంటిది లేకుండా ఎలాంటి పనులను చేసుకోలేని పరిస్థితి వుంది.దేశంలో ఉన్న ప్రజలందరూ దాదాపు ఆధార్ కార్డు, పాన్ కార్డు కలిగి వుండే ఉంటారు.

 How To Get Nri Pan Card Process And Documents Details Details, Nri, Pan Card, Vi-TeluguStop.com

కేవలం భారతదేశంలో ఉన్నవారు మాత్రమే కాకుండా ప్రవాస భారతీయులు( NRI ) కూడా పాన్ కార్డు ( Pan Card ) కోసం అప్లై చేసుకోవచ్చని మీకు తెలుసా.పాన్ అనేది నెంబర్స్, ఇంగ్లీష్ అక్షరాలతో కలిసి మిళితమై ఉంటుంది.

మనదేశంలోని ఆదాయ పన్ను శాఖ ఈ పాన్ నెంబర్‌తో కూడిన కార్డును జారీ చేస్తుంది.ఇండియాలో పన్ను చెల్లింపు పరిధిలోకి వచ్చే ఆదాయం ఉన్నవారు ఖచ్చితంగా పాన్ కార్డ్ కలిగి ఉండాలనేది నియమం.

ఈ పాన్ కార్డు కోసం ఎలాంటి ప్రవాస భారతీయులు అప్లై చేయాలంటే… భారతదేశంలో ఇన్‌కమ్ టాక్స్( Income Tax ) పరిధిలోకి వచ్చే ఆదాయం కలిగి ఉన్న వారు, భారతదేశంలో స్థిరాస్తులు వంటివి కొనుగోలు చేయాలనుకునే వారు, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనునుకునే వారు, అదేవిధంగా మ్యుచ్చువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలని అనుకునేవారు దీనికోసం అప్లై చేసుకోవాలి.దానిని ఇపుడు మీరు ఆన్లైన్లోనే ఇపుడు అప్ప్లయ్ల్ చేసుకోవచ్చు.

దానికోసం UTIITSL లేదా Proteanలో ఆన్‌లైన్‌ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక, అప్లికేషన్ టైప్ కింద ఫామ్ 49ఏ ఫర్ ఎన్ఆర్ఐ సెలెక్ట్ చేసుకోవాలి.తరువాత మీకు విదేశీ పౌరసత్వం వున్నట్లైతే ఫామ్ 49ఏఏ సెలెక్ట్ చేసుకోవలసి ఉంటుంది.అందులో అన్ని వివరాలను నింపిన తరువాత క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.సబ్మిట్ చేసిన తరువాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.అందులో ఎన్ఆర్ఐ పాన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది.ఎన్ఆర్ఐ పాన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ పూర్తిగా ఫిల్ చేసిన అవసరమైన డాక్యుమెంట్స్, డిజిటల్ సిగ్నేచర్ వంటివి అప్లోడ్ చేసి సబ్మిట్ చేసి అమౌంట్ పే చేసిన తరువాత అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ వస్తుంది.ఆ నెంబర్ ద్వారా మీ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు.

Video : How To Get Nri Pan Card Process And Documents Details Details, Nri, Pan Card, Viral Latest , Latest News, Tips, Process, Application, Apply, Apply Nri Pancard, Income Tax Department, Permanent Account Number, #TeluguStopVideo

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube