పంట సాగు విధానంలో విత్తన శుద్ధి ఎలా చేయాలి..ప్రయోజనాలు ఏమిటో తెలుసా..?

రైతులు( Farmers ) ఏ పంట సాగుచేసిన నేలలు, ఎరువుల పైనే కాకుండా విత్తన శుద్ధికి కూడా ప్రాధాన్యం ఇస్తేనే అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందని వ్యవసాయ క్షేత్ర నిపుణులు చెబుతున్నారు.విత్తన శుద్ధి చేసి సాగు ప్రారంభిస్తే పెట్టుబడి భారం తగ్గడం, శ్రమ తగ్గడం తో పాటు దిగుబడి పెరిగే అవకాశం ఉంది.

 How To Do Seed Treatment In Crop Cultivation System..do You Know What Are The Be-TeluguStop.com

విత్తన శుద్ధి చేస్తే పంటను వివిధ రకాల చీడపీడలు లేదా తెగుళ్లు ఆశించే అవకాశం చాలా తక్కువ.కాబట్టి విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలో.

విత్తన శుద్ధి చేస్తే జరిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

Telugu Agriculture, Crop, System, Farmers, Fungus, Seeds, Yield-Latest News - Te

విత్తన శుద్ధి( Seeds ) అంటే.విత్తనాలకు క్రిములు లేదా పురుగులు ఆశించకుండా ఉండేందుకు మందును పొడి రూపంలో గానీ, ద్రవ రూపంలో గానీ విత్తనానికి పట్టించే విధానాన్ని విత్తన శుద్ధి అంటారు.ఆ తరువాత కాసేపు ఎండలో ఆరబెట్టడం వల్ల ఆ విత్తనానికి మందు ఒక లేయర్ ల చుట్టూ అంటుకుని ఉంటుంది.

Telugu Agriculture, Crop, System, Farmers, Fungus, Seeds, Yield-Latest News - Te

విత్తనాన్ని శుద్ధి చేసిన తర్వాత ఆ విత్తనాన్ని పొలంలో నాటితే. ఫంగస్ ( Fungus )లేదా శిలీంద్రాలు విత్తనాన్ని ఆశించలేవు.దీంతో విత్తనం ఆరోగ్యకరంగా మొలకెత్తుతుంది.లేత మొక్కలకు కుళ్ళు తెగులు రాకుండా ఉంటుంది.విత్తన శుద్ధి ద్వారా నేల నుంచి సంక్రమించే తెగుళ్లను దాదాపుగా అరికట్టినట్టే.నేల ద్వారా మొక్కలకు ఎలాంటి నష్టం జరగకపోతే ఇక అనవసర రసాయన పిచికారి మందుల అవసరం కూడా తగ్గుతుంది.

దీంతో పంట నాణ్యత పెరుగుతుంది.ఒకవేళ విత్తన శుద్ధి చేయకుండా విత్తనాలను నాటి సాగుచేపడితే.

చీడపీడలు, తెగుళ్లు పంటను ఆశిస్తాయి.తొలి దశలో వీటిని గుర్తించి సంరక్షణ చర్యలు చేపట్టే లోగా ఎంతో కొంతమేర పంటకు కచ్చితంగా నష్టం కలిగిస్తాయి.

కాబట్టి విత్తన శుద్ధి వల్ల చీడపీడల ప్రభావం కూడా ఉండదని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.ఒక్కో పంటకు ఒక్కోరకంగా విత్తన శుద్ధి చేయాల్సి ఉంటుంది.

వ్యవసాయ నిపుణుల సలహా తీసుకొని విత్తన శుద్ధి చేసిన తర్వాతనే పంట సాగు చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube