వాట్సాప్ లో వీడియో కాల్ రావట్లేదా ? ఈ పని చేయండి

వాట్సాప్ విడియో కాల్ అప్డేట్ ఇచ్చి నెలలు గడుస్తున్నా, ఇప్పటికి చాలామందికి ఈ అప్డేట్ వచ్చినట్టు తెలిదు, తెలిసినవారిలో చాలామందికి విడియో కాల్ అప్డేట్ ఎలా పొందాలో తెలియదు.ఎందుకంటే, ఇది కేవలం ప్లే స్టోర్ కి వెళ్లి అప్లికేషన్ అప్డేట్ చేసుకోగానే జరిగే పని కాదు.

 How To Activate Video Calls In Whatsapp ?-TeluguStop.com

మీకు వాట్సాప్ విడియో కాల్ ఆప్షన్ కావాలంటే, మీరు వాట్సాప్ బేటా వెర్షన్ వాడాల్సి వస్తుంది.అప్పుడే విడియో కాలింగ్ ఆప్షన్ వస్తుంది.

ఇక బేటా వెర్షన్ కి ఎలా అప్డేట్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాం చూడండి.

చాలా సింపుల్ ప్రాసెస్ ఇది.మీ స్టోర్ ఓపెన్ చేసి, వాట్సాప్ అని సెర్చ్ చేయండి.వాట్సాప్ పేజిలో మీకు ఎప్పటిలాగే Uninstall, Open/Update ఆప్షన్స్ కనబడతాయి.

కిందికి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే, సజేస్టేడ్ యాప్స్ కింద Become a beta tester అనే ఆప్షన్ కనబడుతుంది.అక్కడ I’m in మీద క్లిక్ చేయాగానే మీ బేటా వెర్షన్ రిజిస్ట్రేషన్ మొదలవుతుంది.

కొంచెం సమయం తీసుకున్నాక, అక్కడే, అదే వాట్సాప్ పేజిలో మిమ్మల్ని ఫీడ్ బ్యాక్ అడుగుతుంది వాట్సాప్.మీ అభిప్రాయం చెప్పాక, మీకు పైన అప్డేట్ అనే ఆప్షన్ వస్తుంది.

ఇక ఎప్పటిలాగే అప్డేట్ చేసుకున్నక, మీ మొబైల్ లోకి వాట్సాప్ బేటా వెర్షన్ వచ్చేస్తుంది.ఇప్పుడు మీకు వాట్సాప్ కాల్ మీద నొక్కగానే రెండు ఆప్షన్స్ కనబడతాయి.

ఒకటి వాయిస్ కాల్ ఆప్షన్, మరొకటి వీడియో కాల్ ఆప్షన్.మీరు విడియో కాల్స్ చేసుకోవచ్చు కాని, బేటా వెర్షన్ వాడుతున్న యూజర్స్ కి మాత్రమె విడియో కాల్స్ కనెక్ట్ అవుతాయి.

అంటే మీ స్నేహితుడు మీతో వాట్సాప్ విడియో కాల్ లో మాట్లాడాలంటే ఆతను కూడా వాట్సాప్ బేటా వెర్షన్ ఖచ్చితంగా వాడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube