సెలబ్రిటీలు ఎవరైనా సరే వారి భద్రత విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం సహజం.వారి భద్రత కోసం ప్రత్యేకంగా వ్యక్తిగత బాడీగార్డ్స్ ను ఏర్పాటు చేసుకుంటారు సెలబ్రెటీలు సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లినా కానీ, వారితో పాటు బాడీగార్డ్స్ వారి వెన్నంటే ఉండి వారి భద్రతలను కాపాడుతూ ఉంటారు ఈ క్రమంలో సెలబ్రిటీలు వారి వ్యక్తిగత బాడీగార్డ్స్ కి అధిక మొత్తంలో వారికి శాలరీలు ఇస్తారు.
ఇక బాలీవుడ్ తారలు అయితే ఏకంగా వారి వ్యక్తిగత బాడీగార్డ్స్ సంవత్సరానికి కోట్లలో శాలరీలు పే చేసేస్తున్నారు.
బాలీవుడ్ తారల వ్యక్తిగత బాడీగార్డ్స్ శాలరీ విషయానికి వస్తే.
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ రవి సింగ్ అనే బాడీగార్డును ఏర్పాటు చేసుకున్నాడు.షారూఖ్ ఏ ప్రాంతానికి వెళ్లినా కానీ రవి సింగ్ అతని వెంట ఉంటూ షారుఖాన్ రక్షణకు కావలసిన జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకుంటాడు.ఇక రవి సింగ్ కు సంవత్సరానికి 2.5 కోట్లు శాలరీ ని అందచేస్తున్నాడు షారూఖ్.బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన వ్యక్తిగత బాడీగార్డ్ గా జితేందర్ షిండేను నియమించుకున్నాడు ఇక జితేందర్ షిండేకు సంవత్సరానికి కోటిన్నర రూపాయలు శాలరీగా చెల్లిస్తున్నారు మన బిగ్ బి.

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ గా షెరాను నియమించుకొన్నాడు.ఇతనికి సంవత్సరానికి దాదాపు రెండు కోట్లకు పైగానే శాలరీ గా చెల్లిస్తూన్నారు బాలీవుడ్ సల్మాన్ ఖాన్.అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన బాడీగార్డ్ కు సంవత్సరానికి 1.2 కోట్లు ఏడాదికి చెల్లిస్తున్నారు.బాలీవుడ్ క్వీన్ అనుష్క శర్మ తన వ్యక్తిగత బాడీగార్డ్ కు ఏడాదికి 1.2 కోట్లు, దీపికా పదుకొనే బాడీగార్డ్ జలాల్ కు 80 లక్షలు సంవత్సరానికి శాలరీ గా చెల్లిస్తుంది.ఇలా అనేక మంది తారలు వారి భద్రత చర్యల కోసం ఏడాదికి కొన్ని కోట్లలో ఖర్చు చేస్తున్నారు.