ప్రస్తుత రోజులలో క్రమం తప్పకుండా వ్యాయామం చేసే అలవాటు చాలా మంది భారతీయులకు అలవాటు కాలేదు.ఐక్యరాజ్యసమితి ప్రకారం ప్రతి భారతీయుడు వారానికి కనీసం 150 నిమిషాల వ్యాయామం చేయాలి.
కానీ భారతదేశంలో 50% భారతీయులు దీన్ని చేయలేకపోతున్నారు.అందుకే వారికి వయసుతో పాటు గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు కూడా వస్తున్నాయి.
అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్లో నిర్వహించిన ఒక అధ్యయనంలో 60 సంవత్సరాలు పైబడిన వారు రోజుకు 6000 నుంచి 9000 అడుగులు నడిస్తే వారి గుండె జబ్బుల ముప్పు 50% తగ్గుతుంది.సాంస్కృతిక మరియు సామాజిక కారణాలవల్ల తమ ఉద్యోగాల నుంచి రిటైర్ అయిన తర్వాత భారతదేశంలో ప్రజలు శరీరక శ్రమకు దూరంగా ఉంటున్నారు.
భారతదేశంలో చాలామంది ప్రజలు పనిచేస్తున్నప్పుడు వారి కార్యాలయానికి నడిచి వెళ్తారు.
కానీ రిటైర్ అయ్యాక ఇంట్లో ఏదో ఒక మూలనా కూర్చొని ఉంటారు.వారు శారీరక శ్రమతో పాటు కొన్ని వినోద కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండటం మంచిది.పదవి విరమణ తర్వాత చాలామంది భారతీయులు సామాజిక ఒంటరితనం మరియు జీవితంలో ప్రయోజనం లేకపోవడాన్ని ఎదుర్కొంటున్నారు.
ఇది వారి శారీరక మరియు మానసిక ఆరోగ్యం క్షీణతకు దారి తీస్తుంది.అందుకే అలాంటి వారిని చురుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలి.కాలం మారుతోంది కానీ ఇప్పటికీ చాలా భారతీయ ఇళ్ళలో ఇంటి బాధ్యత మహిళలపై ఉంటుంది.
మహిళలు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి సమయం అసలు ఉండదు.ఇంటి పనులు చేసుకుంటూ కష్టపడి పనిచేయడం వల్ల స్త్రీలకు వేరుగా ఎలాంటి వ్యాయామం అవసరం లేదని అపోహ కూడా చాలామంది ప్రజలలో ఉన్నాయి.ఇది కొంతవరకు నిజం కావచ్చు.
కానీ ఇంటి పనులలో నిమగ్నమైన మహిళలు వారి ఆరోగ్యం బాగుండాలంటే క్రమం తప్పకుండా నడవాలి.మనం ఎంతవరకు నడుస్తామనేది ట్రాక్ చేయడం ప్రయోజనకరంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.