TDP, BJP: ఎన్డీయే లోకి టీడీపీ.. బీజేపీ కి ఎన్ని సీట్లు ఇస్తున్నారంటే ?

గత రెండు రోజులుగా టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) ఢిల్లీలోనే మకాం వేసి మరీ బిజెపి కీలక నేత,  కేంద్ర హోం మంత్రి అమిత్ షా తోను , బిజెపి జాతియ అధ్యక్షుడు జేపీ నడ్డా తోను పొత్తుల అంశంపై చర్చలు జరిపారు.ఈ పొత్తుల చర్చలు ఫలించడంతో టిడిపి, జనసేన,  బిజెపి ( TDP, Jana Sena, BJP )మధ్య పొత్తు ఇక కుదిరినట్లే .

 How Many Seats Are Being Given To Tdp And Bjp In Nda-TeluguStop.com

లాంఛనంగా ఎన్డీఏలోకి టిడిపి చేరబోతోంది.  ఈరోజు ఉదయం 11 గంటలకు అమిత్ షా తో చంద్రబాబు పవన్ భేటీ అయ్యారు .దాదాపు గంట పాటు ఈ పొత్తుల అంశంపై చర్చలు జరిపారు.బిజెపికి టిడిపి అధినేత చంద్రబాబు ఇవ్వాలనుకుంటున్న సీట్లు తదితర అంశాలపై చంద్రబాబు పవన్ లతో అమిత్ షా చర్చించారు.

  అలాగే బిజెపి కోరుకుంటున్న సీట్ల వివరాలను ఆ పార్టీ అధినాయకత్వం చంద్రబాబు పవన్ ల ముందు ఉంచిందట.ఈ సందర్భంగా సీట్ల సర్దుబాటుపై చర్చించి ఒక క్లారిటీకి వచ్చినట్లు సమాచారం .

Telugu Ap, Apcbn, Tdp Bjp Nda, Jp Nadda, Pavan Kuna-Politics

పొత్తులో భాగంగా 6 ఎంపీ సీట్లు ఇచ్చేందుకు టిడిపి అధినేత చంద్రబాబు అంగీకారం తెలిపారట.అసెంబ్లీ సీట్ల విషయంలో అమిత్ షా ( Amit Shah )తో జరిగిన చర్చల్లో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదట.దీనిపై రాష్ట్ర స్థాయి నాయకులతో చర్చించాలని బిజెపి నిర్ణయించుకుందట.రాష్ట్ర బిజెపి ఏపీ అధ్యక్షురాలతో మాట్లాడాలని అమిత్ షా సూచించినట్లు సమాచారం.  మరికొద్ది సేపట్లో టిడిపి, జనసేన , బిజెపి ఉమ్మడి ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నాయి, .టిడిపి,  బిజెపి మధ్య పొత్తు ఖాయం కావడంతో ఈనెల 14న జరగబోయే సమావేశానికి టిడిపిని సైతం ఆహ్వానించారట.అయితే టిడిపి జనసేన బిజెపి మధ్య పొత్తు ఖాయమైన నేపథ్యంలో సీట్ల పంపకాలు ఏ విధంగా చేపడుతారు అనేది అందరికీ ఆసక్తికరంగా మారింది .

Telugu Ap, Apcbn, Tdp Bjp Nda, Jp Nadda, Pavan Kuna-Politics

బిజెపికి 6 ఎంపీ సీట్లు ఇచ్చేందుకు టిడిపి అంగీకారం తెలిపింది.అయితే ఆ ఆరు నియోజకవర్గాలు ఏమిటి అనేది ఎక్కడా బయటకు రాకుండా చంద్రబాబు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు .ఇప్పటికే జనసేనకు పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ , మూడు ఎంపీ సీట్లు ఇచ్చారు .మిగిలిన స్థానాల్లో టిడిపి , బిజెపి సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube