మహేష్ బాబు సినిమాలకు నిర్మాతగా రమేష్ బాబు ఎన్ని సినిమాలు తీసారో తెలుసా?

తాజాగా ఘట్టమనేని ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు ఘట్టమనేని రమేష్ బాబు అనారోగ్యం కారణంగా తుది శ్వాస విడిచారు.

రమేష్ బాబు కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.తాజాగా ఆయన పరిస్థితి మరింత విషమించడంతో కుటుంబ సభ్యులు అతడిని గచ్చిబౌలిలోని ఏ ఐ జి హాస్పిటల్ కి తరలించారు.

అయితే అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.రమేష్ బాబు మరణవార్తతో ఘట్టమనేని ఇంట్లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి.

అతని మరణ వార్త విన్న పలువురు ప్రముఖులు అలాగే ఘట్టమనేని అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.రమేష్ బాబు సినిమాల విషయానికి వస్తే.

Advertisement

మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించాడు.ఆ తర్వాత సామ్రాట్ సినిమాతో హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

నటుడిగా పలు సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నాడు.ఇక ఆ తరువాత చివరిసారిగా 1997లో వచ్చిన ఎన్ కౌంటర్ సినిమాలో నటించారు రమేష్ బాబు.

ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యారు.ఆ తర్వాత ఎప్పుడు కూడా సినిమాల్లో నటించలేదు.

కానీ సినిమాలకు దూరంగా ఉంటూ నిర్మాతగా వ్యవహరించారు రమేష్ బాబు.కృష్ణా ప్రొడక్షన్ హౌస్ స్థాపించి అర్జున్, అతిధి ఇలాంటి సినిమాలను తెరకెక్కించారు రమేష్ బాబు.అలాగే మహేష్ బాబు హీరోగా నటించిన దూకుడు, ఆగడు లాంటి సినిమాలకు సమర్పకుడిగా వ్యవహరించారు.

సమంత నాగచైతన్య విడాకులకు పిల్లలే కారణమా.. అసలు విషయం బయటపెట్టిన చైతన్య?
రహస్యంగా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ సింగర్లు.. ఈ జోడి క్యూట్ కపుల్ అంటూ?

అదే విధంగా బాలీవుడ్ నటుడు బిగ్ బీ అయిన అమితాబ్ బచ్చన్ తో కలసి సూర్యవంశం సినిమాను తెరకెక్కించారు.నటుడిగా సినిమాలకు దూరమైన తరువాత తెలుగులోనూ అలాగే హిందీలో పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు.

Advertisement

తాజా వార్తలు