నాని అష్టాచమ్మా సినిమాతో హీరోగా పరిచయం అయిన నాని ఆ సినిమా తర్వాత వరుసగా హిట్స్ అందుకుంటూ న్యాచురల్ స్టార్ నాని గా పేరు సంపాదించుకున్నారు అలాంటి నాని హీరో అవ్వడానికి ముందు చాలామంది డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు.మొదట గా లెజెండరీ డైరెక్టర్ అయిన బాపు గారి దగ్గర రాధ గోపాలం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యారు ఆ తరువాత శ్రీను వైట్ల దగ్గర కమెడియన్ సునీల్ జాయిన్ చేశాడు దాంతో కొన్ని సినిమాలకి ఆయన దగ్గర వర్క్ చేశాడు.

ఇంద్రగంటి మోహన్ కృష్ణ అష్ట చమ్మ అనే సినిమా స్క్రిప్ట్ రాసుకొని హీరో గా కొత్త వాళ్లని తీసుకుందాం అనుకున్నప్పుడు ఇంద్రగంటి గారికి నాని కనిపించాడు దాంతో ఆయన్ని హీరోగా పెట్టీ తీసిన అష్ట చమ్మ సినిమా మంచి హిట్ అయింది.ప్రస్తుతం ఇండస్ట్రీ లో నాని ఒక మంచి హీరోగా గుర్తింపు పొందాడు.ప్రస్తుతం దసర అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్నట్టు తెలుస్తుంది.ఈ సినిమా కనక హిట్ అయితే నాని ఒక మంచి మాస్ హీరోగా మారిపోతాడు అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి.
ఇంతకు ముందు వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో వచ్చిన అంటే సుందరానికి సినిమా ప్లాప్ అయ్యింది అందుకే మళ్ళీ దసర సినిమా తో హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవుదామని చూస్తున్నారు.








