హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.గిరిజన నాయకులు, కార్యకర్తలు నిమ్స్ వద్దకు భారీగా చేరుకుంటున్నారు.
వరంగల్ లోని కేఎంసీలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన చేసిన విద్యార్థినికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఈ మేరకు ఆస్పత్రి ముందు బైటాయించి ఆందోళనకు దిగారు.
దీంతో నిమ్స్ వద్ద టెన్షన్ వాతావరణం ఏర్పడింది.అయితే తన కూతురి పరిస్థితి విషమంగా ఉందని, అందుకు సీనియర్ల వేధింపులే కారణమని ఆరోపించిన సంగతి తెలిసిందే.







