గోపీచంద్ హీరోగా ఒక సినిమా వస్తుందంటే దాని మీద మాస్ ఆడియెన్స్ లో మంచి అంచనాలే ఉంటాయి.ఎందుకంటే గోపిచంద్ సినిమాలు ఎక్కువగా ఆడేది బి, సి సెంటర్లోనే కాబట్టి, నిజానికి వాళ్ళు చూస్తూనే సినిమాలు సక్సెస్ అవుతాయి వాళ్ళు మాత్రమే సినిమా నచ్చితే ఆ సినిమాలని రెండు, మూడు సార్లు చూస్తారు.
ఏ సెంటర్ ఆడియన్స్ ఒక్కసారి మాత్రమే చూస్తారు.అందుకే అందరూ హీరోలు కూడా బి, సి సెంటర్ లో మార్కెట్ కోసం బాగా ట్రై చేస్తారు.

ప్రస్తుతం గోపిచంద్ ప్లాప్ ల్లో ఉన్నాడు.కాబట్టి ఆయనకి ఇప్పుడు తప్పనిసరిగా హిట్ కావాలి ఈ సినిమాతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు.అందుకే ఇప్పటికే తనకి లక్ష్యం, లౌక్యం లాంటి సినిమాలతో హిట్ ఇచ్చిన శ్రీవాస్ డైరెక్షన్ లో మళ్ళీ సినిమా చేస్తున్నాడు.రామబాణం పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి హీరో కి సంభందించిన ఒక వీడియోని సినిమా యూనిట్ ఈరోజు రిలీజ్ చేసింది ఈ వీడియో మొత్తం యాక్షన్ తోనే సాగుతుంది… దీంట్లో చిన్నొడా అనే ఒకే ఒక డైలాగ్ మాత్రమే వీడియో చివర్లో వస్తుంది.
ఇక ఈ 49 సెకన్ల వీడియోని చూస్తే ఈ సినిమా కూడా లక్ష్యం, లౌక్యం లాగా యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది.ఇక ఈ సినిమా టైటిల్ ని కూడా అన్ స్టాపబుల్ షో లో బాలయ్య బాబు చేత నామకరణం చేపించడం జరిగింది.
ఈ సినిమా కూడా గోపిచంద్, శ్రీవాస్ లా ముందు సినిమాలు అయిన లక్ష్యం, లౌక్యం సినిమాల మాదిరి మంచి సక్సెస్ అయి వీళ్ళ కాంబోలో హ్యాట్రిక్ హిట్టు కొట్టాలని కోరుకుందాం…
.







