బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నందమూరి తారకరత్న మరణించారు.దాదాపు ఇరవై మూడు రోజులపాటు బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందిన తారకరత్న… కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడవటం జరిగింది.
లోకేష్ పాదయాత్ర మొదటి రోజే తారకరత్నకి గుండెపోటు రావడం జరిగింది.ఆ సమయంలో కుప్పంలో స్థానిక ఆసుపత్రిలో జాయిన్ చేయగా పరిస్థితి విషమించటంతో తర్వాత బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది.

ఈ క్రమంలో ప్రముఖ స్పెషలిస్టులు విదేశీ వైద్యులు సైతం ప్రత్యేక వైద్యం అందించారు.బాలకృష్ణ బెంగళూరు ఆసుపత్రిలోనే తారకరత్న బాగోగులను చూసుకోవటం జరిగింది.బతికి రావాలని ప్రత్యేకంగా పూజలు కూడా నిర్వహించారు.తారకరత్న బతికి బయటకు రావాలని నందమూరి అభిమానులు ఇంకా చాలామంది సన్నిహితులు భగవంతునికి ప్రార్ధనలు చేశారు.అయినా గాని బలమైన చికిత్స విదేశీ వైద్యులతో అందించిన గాని.తారకరత్న మరణించడం జరిగింది.
దీంతో తారకరత్న మరణం పట్ల నందమూరి కుటుంబ సభ్యులతో పాటు…టీడీపీ కార్యకర్తలు నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.ఈరోజు రాత్రి ఎయిర్ అంబులెన్స్ ద్వారా బెంగళూరు నుండి హైదరాబాద్ తరలించనున్నారు.







