జబర్దస్త్ రష్మి కొత్త ప్లాన్! సినిమాల నుంచి ఏకంగా అటు షిఫ్ట్ అవుతుంది

జబర్దస్త్ కామెడీ రియాలిటీ షోతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ముద్దుగుమ్మ రష్మి, ఎప్పుడో పదేళ్ళకి ముందే నటిగా ప్రూవ్ చేసుకోవాలని టాలీవుడ్ లో అడుగు పెట్టిన ఈ భామకి కెరియర్ తొలినాళ్ళలో అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు.

ఏదో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలు, కాలేజీ గ్యాంగ్ లో వచ్చి పోయే పాత్రలు చేసింది.

అయితే అన్నపూర్ణ ప్రొడక్షన్ లోవచ్చిన యువ సినిమా రష్మికి కాస్తా గుర్తింపు తీసుకొచ్చింది.ఆ తరువాత కూడా సినిమాలలో ఓ మోస్తరు పాత్రలు వచ్చాయి.

అయితే జబర్దస్త్ యాంకర్ గా టర్న్ అయిన తర్వాత యాంకరింగ్ కి కాస్తా గ్లామర్ టచ్ ఇవ్వడంతో ఈ అమ్మడు క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.గ్లామర్ గా కనిపించడానికి ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడంతో పాటు గుంటూరు టాకీస్ సినిమాలో బోల్డ్ పాత్రలో ఎంటర్టైన్ చేయడంతో ఈ భామ క్రేజ్ పెరిగిపోయి వరుసగా అవకాశాలు వచ్చి పడ్డాయి.

ఇక వచ్చిన అవకాశాలని వచ్చినట్లు ఒప్పుకొని రెండు చేతులా సంపాదించుకున్న ఈ భామకి హీరోయిన్ గా అనుకున్న స్థాయిలో ఇమేజ్ రాలేదు.ఓ వైపు అనసూయ విభిన్న పాత్రలతో దూసుకుపోతూ తనకంటూ బ్రాండ్ వేసుకుంటూ ఉంటే రష్మి మాత్రం ఇన్ని రోజులు హీరోయిన్ పాత్రల చుట్టూనే తిరిగింది.

Advertisement

అయితె ఈ సినిమాల వలన కావాల్సినంత క్రేజ్ రాకపోవడంతో ఇప్పుడు ఈ భామ మరో ప్రయత్నం మొదలుపెట్టింది.ప్రస్తుతం మంచి ట్రెండింగ్ లో ఉన్న వెబ్ సిరిస్ లో తన టాలెంట్ చూపించుకొని సత్తా చాటాలని అనుకుంటుంది.

ఎ ఫిలిం బై అరవింద్ సినిమాని తీసిన శేఖర్ సూరి దర్శకత్వంలో వెబ్ సిరిస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.మరి ఈ వెబ్ సిరిస్ రష్మికి ఏ స్థాయి గుర్తింపు తీసుకొస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు