కోతిని అమాంతం మింగేసిన డైనోసరస్ బల్లి

ఒకప్పుడు ఈ భూమి మీద డైనోసరస్ అనే రాకాసి బల్లులు ఎక్కువగా ఉండేవి.ఈ భూమండలం మొత్తం భారీకాయంతో ఉండే ఆ రాకాసి బల్లులు ఎక్కువగా సంచరిస్తూ ఉండేవని పరిశోధకులు సైతం నిర్ధారించారు.

 Horrifying Moment Komodo Dragon Eats A Live Monkey-TeluguStop.com

వాటి ఉనికి నిరూపించే ఎన్నో శకలాలు దొరికాయి.వాటి ఆధారంగా పరిశోధన చేసి రాకాసి బల్లుల ఉనికి నిజమే అని చెప్పారు.

అయితే కాలక్రమంలో భూ వాతావరణంలో వచ్చిన మార్పులు, అతి భయంకరమైన తుఫాన్ లు, భూకంపాల కారణంగా ఈ రాకాసి బల్లులు చాలా వరకు అంతరించిపోయాయి.అయితే వాటిలో కొన్ని జాతులు భూ వాతావరణ పరిస్థితులకి తగ్గట్లు తమ శరీర స్థితిని మార్చుకోవడం ద్వారా పక్షులు, కోళ్ళు, ఉడుతలు, బల్లుల, ఉడుములు, ముంగిసలు రూపంలో తిరుగుతున్నాయి.

వీటి పూర్వీకులే రాకాసి బల్లులు.

అల అంతరించిపోగా ఉన్న ఉన్న కొన్ని డైనోసరస్ లో కాస్తా పెద్దగా ఉండే ఇప్పటికి ఉన్న ఒకటి కొమాడో డ్రాగన్.

వీటిని మోనిటర్ లిజార్డ్స్ అని పిలుస్తారు.సాధారణ మోనిటర్ లిజార్డ్స్ కంటే ఆకారంలో పెద్దగా ఉండేవి కొమాడో లిజార్డ్స్ అంటారు.ఇవి చాలా బలంగా ఉంటాయి.ప్రస్తుతం ఇవి అతి తక్కువ మొత్తంలో ఇండోనేషియాలో ఎక్కువగా కనిపిస్తుంటాయి.

వీటి నాలుక పొడవుగా ఉంటుంది.వీటి లాలాజలంలో ఇరవై రకాల బాక్టీరియాలు ఉండటం వలన లాలాజం విషపూరితంగా ఉంటుంది.

ఈ లాలాజలం నుంచి ఇవి తమని తాము రక్షించుకుంటూ, ఇతర జంతువుల మీద దాడి చేసి ఆహారంగా తీసుకుంటాయి.ఇదిలా ఉంటే తాజాగా ఇండోనేషియాలోని దీవిలో కొమాడో డ్రాగన్ ఓ కోతిని అమాంతంగా మింగేసింది.

డ్రాగన్ దగ్గరకు వచ్చి ఆటలాడుతున్న కోతిని ఆ డ్రాగన్ అమాంతంగా నోటితో పట్టేసింది.రెండు నిముషాలు ఆరు గుటకల్లో ఆ కోతిని స్వాహా చేసింది.

దీనిని ఓ వ్యక్తి వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube