సాదారణ పండ్లతో ఇంటిలో తయారుచేసే జుట్టు మస్క్స్  

Homemade Fruit Masks And Packs For Hair-

మనకు అందుబాటులో ఉండే సాదారణమైన పండ్లతో హెయిర్ మస్క్స్ తయారుచేసుకోవచ్చు.వీటిలో పోషకాలు సమృద్దిగా ఉండుట వలన జుట్టుకు చాల ప్రయోజనకారిగా ఉంటాయి.

ఈ పండ్లు అన్ని సీజన్ లలోను అందుబాటులో ఉంటాయి.అంతేకాక ఈ మస్క్స్ అనేక జుట్టు సమస్యలను పరిష్కరిస్తాయి.ఇప్పుడు ఆ మస్క్స్ గురించి తెలుసుకుందాం.

-

1.తేనె మరియు బొప్పాయి హెయిర్ మాస్క్
ఈ మాస్క్ పొడి మరియు కఠినమైన జుట్టు వారికీ బాగుంటుంది.ఈ మాస్క్ లో ఉపయోగించిన బొప్పాయి,తేనే రెండింటిలోను సహజ తేమ లక్షణాలు ఉన్నాయి.

అందువల్ల ఈ మాస్క్ జుట్టు లోపల నుంచి పనిచేసి జుట్టును మృదువుగా మారుస్తుంది.

జుట్టు పరిమాణం బట్టి ఒకటి లేదా రెండు కప్పుల బొప్పాయి ముక్కలను మెత్తని పేస్ట్ గా చేసి రెండు నుంచి నాలుగు స్పూన్ల తేనెను కలపాలి.ఈ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

2.గుడ్డు మరియు అవోకాడో హెయిర్ మాస్క్
ఈ అద్భుతమైన మాస్క్ జుట్టు చిట్లే సమస్యకు బాగా పనిచేస్తుంది.ఒక బౌల్ లో రెండు అవోకాడోల గుజ్జు, ఒకటి లేదా రెండు గుడ్ల సోన వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని బ్రష్ సాయంతో జుట్టుకు రాసి 45 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.అయితే జుట్టు మీద గుడ్డు వాసన పోవాలంటే తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకోవచ్చు.

3.బాదం మరియు ఆరెంజ్ ఆయిల్ హెయిర్ మాస్క్
ఈ మాస్క్ జుట్టు మెరుపుకు సహాయపడుతుంది.

ఆరెంజ్ లో యాంటి ఆక్సిడెంట్స్, విటమిన్ సి సమృద్దిగా ఉంటాయి.బాదం నూనెలో విటమిన్ ఇ సమృద్దిగా ఉండుట వలన జుట్టు మరియు చర్మం రెండింటికి అద్భుతమైన పోషణను అందిస్తుంది.

ఆరెంజ్ జ్యూస్ లో రెండు స్పూన్ల బాదం నునెను కలిపి జుట్టుకు రాసి అరగంట అయ్యాక తలస్నానం చేయాలి.

తాజా వార్తలు