'సలార్' ఓవర్సీస్ రైట్స్ ఆ సంస్థకే.. ఎంత చెల్లించారంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ( Prabhas ) సినిమాలకు మార్కెట్ లో ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఎందుకంటే ఈయనకు బాహుబలి ( Bahubali ) సిరీస్ తో పాన్ ఇండియా (Pan India) వ్యాప్తంగా భారీ మార్కెట్ పెంచుకున్నాడు.

 Hombale Films Sold The Overseas Rights Of Salaar For A Big Amount, Salaar, Salaa-TeluguStop.com

ఈయన క్రేజ్ చూసి రాబోయే సినిమాలకు ఎంత అమౌంట్ అయిన పెట్టడానికి డిస్టిబ్యూషన్ సంస్థలు రెడీగా ఉన్నాయి.అందుకే ప్రభాస్ సినిమాలకు నిర్మాతలు సైతం ఎంత పెట్టుబడి పెట్టడానికి అయినా వెనకడుగు వేయడం లేదు.

ఈ క్రమంలోనే ప్రభాస్ తనకు వచ్చిన ఆఫర్స్ ను వదులుకోకుండా జాగ్రత్తగా తన లైనప్ సెట్ చేసుకున్నాడు.మరి ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో ‘సలార్’ ఒకటి.

ఈ సినిమాను కెజిఎఫ్ ( KGF ) డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.కెజిఎఫ్ సినిమాతో సంచలన విజయం అందుకున్న నీల్ వెంటనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను లైన్లో పెట్టాడు.

భారీ హిట్ తర్వాత నీల్ చేస్తున్న సినిమా సలార్ కావడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగి పోయాయి.వీరి కాంబోలో ఏ రేంజ్ లో యాక్షన్ బ్లాక్ బస్టర్ తెరకెక్కుతుందో అని డార్లింగ్ ఫ్యాన్స్ (Prabhas Fans) అంతా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.

ప్రస్తుతం ఫారిన్ కంట్రీస్ లో శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమా అప్పుడే బిజినెస్ పరంగా కేక పుట్టిస్తుంది.

Telugu Salaar, Hombalesold, Prabhas, Prashanth Neel, Shruti Haasan-Movie

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా యొక్క ఓవర్సీస్ రైట్స్ ( Overseas Rights ) ని భారీ ధరకు ప్రముఖ డిస్టిబ్యూషన్ సంస్థ ఫార్స్ ఫిలిమ్స్ ఎల్ ఎల్ సి వారు దక్కించు కున్నట్టు తెలుస్తుంది.ఓవర్సీస్ లోనే కాదు ఈ సినిమాకు అన్ని ప్రాంతాల నుండి కూడా బిజినెస్ పరంగా భారీ ఆఫర్స్ వస్తున్నాయట.దీంతో ఈ సినిమా రైట్స్ భారీ డీల్ కే క్లోజ్ అయ్యేలా కనిపిస్తుంది.

Telugu Salaar, Hombalesold, Prabhas, Prashanth Neel, Shruti Haasan-Movie

ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ ( Shruti Haasan ) హీరోయిన్ గా నటిస్తుండగా.కెజిఎఫ్ వంటి సినిమాను నిర్మించిన హోంబలే ( Hombale Films ) వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసారు.దీంతో ఈ సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేసి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయడానికి మేకర్స్ సిద్ధం అవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube