ఆరోజు రాత్రి అతను బలవంతం చేశాడు.. సింగర్ కామెంట్స్ వైరల్!

స్త్రీలపై సమాజంలో మాత్రమే కాకుండా సినీ పరిశ్రమలో కూడా లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయి.హీరోయిన్ లు కూడా ఈ లైంగిక వేధింపులకు గురవుతూనే ఉన్నారు.

కొంతమంది హీరోయిన్ లు భయపడి వారికి జరిగిన సంఘటనలు బయటకు చెప్పడం లేదు.కొందరు హీరోయిన్ లు నిర్మొహమాటంగా వారికి జరిగిన సంఘటనలు అన్యాయాల గురించి బయట పెడుతున్నారు.

ఈ క్రమంలోనే సింగర్​ లీసా జెంటిల్ తనపై హాలీవుడ్ సీనియర్ నటుడు క్రిస్ నాత్ పై సంచలన ఆరోపణలు చేసింది.క్రిస్ తనని లైంగికంగా వేధించాడని అదే విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు అంటూ ఆమె తెలిపింది.

లీసా మొదటిసారిగా క్రిస్ ని 1998లో న్యూయార్క్ లోని ఒక రెస్టారెంట్ లో కలిసానని తెలిపింది.అలా వారి మధ్య 2002 వరకు స్నేహం ఉండేదని చెప్పుకొచ్చింది.

అయితే 2002లో ఒకసారి అతడు ఒక రోజు రాత్రి రెస్టారెంట్ నుంచి ఇంటి దగ్గర దింపుతానని చెప్పి అతడు ఇంటి దగ్గరకు డ్రాప్ చేశాడని, అనంతరం నిన్ను చూడాలని ఉంది అనగా వెంటనే ఆమె క్రిస్ ని లోపలికి రమ్మని పిలిచిందట.అతను వెంటనే బలవంతంగా తన దగ్గరకు లాక్కుని ముద్దు పెడుతూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడట.

అయితే ఆమె అతడిని ఆపేందుకు ప్రయత్నించిన క్రమంలోనే అతడు మరింత రెచ్చిపోయి ఆమె చేతులను అతని షర్టు లోపలకి పోనిచ్చి ఆమె పట్ల మరింతగా రెచ్చిపోయి ఆమెకు ముద్దులు పెట్టాడట.

ఇక ఆమె తన శక్తినంతా కూడగట్టుకుని అతన్ని వెనక్కి నెట్టేసి తనకు ఇదంతా ఇష్టం లేదని చెప్పడంతో, వెంటనే అతను ఆమె ను  నోటికి వచ్చినట్టుగా తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడట.అయితే అక్కడ జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే ఇండస్ట్రీలోనే లేకుండా చేస్తానని ఆమెను బెదిరించాడట.అప్పటినుంచి అతడు ఆమె కెరీర్ ను ఎక్కడ నాశనం చేస్తాడన్న భయంతో ఆమె ఇరవై ఏళ్ళ పాటు ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా ఉన్నానని చెప్పుకొచ్చింది.

క్రిస్ కేవలం ఆమె మాత్రమే కాకుండా మరో నలుగురు మహిళలను కూడా లైంగిక వేధింపులకు గురి చేశాడని ఆరోపించింది.కానీ అతను మాత్రం ఆమె ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదని కొట్టిపారేశాడు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

తాజా వార్తలు