ఛత్తీస్గఢ్లో( Chhattisgarh ) మరోసారి హై టెన్షన్ వాతావరణం నెలకొంది.రాష్ట్రం సుక్మా జిల్లాలో ఎదురు కాల్పులు తీవ్ర కలకలం సృష్టించాయి.
కాగా ప్రస్తుతం పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.కాల్పుల్లో పలువురు మావోయిస్టులకు గాయాలు అయ్యాయని తెలుస్తోంది.
కాగా బీజాపూర్ లో మావోయిస్టు అగ్రనేత ఉన్నాడన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు విస్తృతంగా కూంబింగ్ చేపట్టాయి.దంతెవాడ, బీజాపూర్, సుక్మా జిల్లాల్లో మావోయిస్టుల కోసం ఈ పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది.







