Film Reviews : మూవీ రివ్యూలు రాసేవాళ్లకు హైకోర్టు షాక్.. అలా రివ్యూలు రాస్తే మాత్రం జైలుకే అంటూ? 

సాధారణంగా ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటే ఆ సినిమాపై ఎన్నో అంచనాలు ఉంటాయి అయితే సినిమా విడుదలైన తర్వాత సినిమా ఎలా ఉంది అనే విషయాలను సినీ క్రిటిక్స్ మాత్రమే కాకుండా ప్రేక్షకులు కూడా రివ్యూ( Movie Review ) ఇస్తూ ఉంటారు.ఇలా సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులు ఇచ్చే రివ్యూస్ ఆధారంగా ఆ సినిమా కలెక్షన్స్ ఆధారపడి ఉంటాయనే విషయం మనకు తెలిసిందే.

 High Court Gives Ultimate Shock To Movie Reviewers-TeluguStop.com

అయితే కొంతమంది కొన్ని సినిమాల విషయంలో ఉద్దేశపూర్వకంగా ఇలాంటి కామెంట్స్ ద్వారా సినిమా కలెక్షన్ల పై దెబ్బ కొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే కేరళలో ఓ రోమాలింటే అద్యతే ప్రాణాయం( Aadyathe Pranayam ) చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ముబీన్ రుయాఫ్( Director Mubeen Rauf ) రివ్యూలపై హైకోర్టుని ఆశ్రయించారు.


Telugu Mubeen Rauf, Kerala, Reviews-Latest News - Telugu

ఇలా తన సినిమా విడుదలైన తర్వాత వారం రోజులపాటు తన సినిమాకు సంబంధించి ఎలాంటి రివ్యూ రాకూడదని ఈయన కోర్టులో పిటిషన్ వేశారు.అయితే ఈయన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు సంచలనంగా మారింది.సినిమా పరువుకు భంగం కలిగించేలా, కించపరిచేలా ఉన్న రివ్యూలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేరళ ( Kerala ) పోలీసులకి ఆదేశాలు జారీ చేసింది.ఎవరైతే సినిమా పరువుకు నష్టం కలిగేలా అలాగే సినిమా బాగాలేదు అంటూ చెడు రివ్యూలు ఇచ్చే వారిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కోర్టు ఆదేశాలను జారీ చేసింది.


Telugu Mubeen Rauf, Kerala, Reviews-Latest News - Telugu

సినిమాపై నిర్మాణాత్మక విమర్శలు, అభిప్రాయాలు వ్యక్తం చేయడం తప్పులేదు కాని కావాలని నాశనం చేసే విధంగా ఉండకూడదని పేర్కొంది.స్వార్థ ప్రయోజనాలతో ఉద్దేశపూర్వకంగానే సినిమాపై నెగటివ్ రివ్యూ( Negative Reviews ) ఇచ్చి సినిమాకు నష్టాలను కలిగించే విధంగా ఉండకూడదని కోర్టు తీర్పు ఇవ్వడంతో కోర్టు ఇచ్చినటువంటి తీర్పు పై కేరళ చిత్ర పరిశ్రమ హర్షం వ్యక్తం చేశారు అయితే ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.ప్రతి ఒక్క చిత్ర పరిశ్రమలో కూడా ఈ విధమైనటువంటి తీర్పు వస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.ఇకపై సినిమాలకు రివ్యూ ఇచ్చేవారు ఈ కోర్టు( Kerala High Court ) తీర్పును గుర్తు పెట్టుకొని రివ్యూ ఇస్తే బాగుంటుందని పొరపాటున నెగిటివ్ రివ్యూ ఇస్తే జైలు శిక్ష తప్పదని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube