నడిగర్ సంఘం ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు...ఎన్నికలు షురూ

తమిళ చిత్ర పరిశ్రమ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఎన్నికలు నడిగర్ సంఘం ఎన్నికలు.

ఈ నెల 23 వ తేదీన అనగా ఈ రోజు ఈ ఎన్నికలు జరగాల్సి ఉంది.

అయితే పరిశ్రమకు సంబందించిన 61 మంది వ్యక్తుల సభ్యత్వం రద్దుకు సంబంధించిన ఒక కేసు కోర్టు విచారణ లో ఉంది.ఈ క్రమంలో ఆ కేసు తీర్పు వెలువడే వరకు ఈ నడిగర్ సంఘం ఎన్నికలను నిలిపివేయాలి అంటూ ఇటీవల తమిళనాడు లో ఒక అధికారి మద్రాస్ హైకోర్టు లో పిటీషన్ దాఖలు చేశారు.

అయితే ఈ పిటీషన్ పై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు శుక్రవారం తీర్పును వెల్లడించింది.అనుకున్న ప్రకారంగా ఈ రోజు నడిగర్ సంఘం ఎన్నికలు జరగాలి అంటూ తీర్పు వెల్లడించడం తో యధావిధిగా ఈ రోజు అక్కడ ఎన్నికలు జరగనున్నాయి.

ఈ ఎన్నికల్లో నటుడు విశాల్ గ్రూప్ కి,అలానే భాగ్యరాజ్ గ్రూప్ కి మధ్య పోరు జరగనుంది.ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి ఎంజీఆర్ జానకి కాలేజీ లో ఈ ఎన్నికలు జరగనుండగా, సినీ పరిశ్రమ కు చెందిన 3,161 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Advertisement

ఈ ఎన్నికల నేపథ్యంలో గత కొద్దీ రోజులుగా అక్కడ సీనియర్ నటులు,నటులు మాటల తూటాలు పేలుస్తున్నారు.

ఇటీవల సీనియర్ డైరెక్టర్ భారతీరాజా తమిళ ఇండస్ట్రీ లో తెలుగు వాడి పెత్తనం ఏంటి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.మొన్నటి కి మొన్న నటి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా విశాల్ తీరు ఫై మండిపడ్డారు.నా ఓటును నువ్వ్వు కోల్పోయావు అంటూ సోషల్ మీడియా ద్వారా విశాల్ కు చురకలు అంటించింది.

మరి ఎన్నికల్లో మరోసారి విశాల్ గ్రూప్ విజయాన్ని అందుకుంటుందా లేదా భాగ్యరాజ్ గ్రూప్ విజయాన్ని అందుకుంటుందా అనేది తెలియాల్సి ఉంది.

నిజమా : క్లీన్‌ షేవ్‌ చేసుకుంటే ప్రాణాంతక వ్యాధి వస్తుందట
Advertisement

తాజా వార్తలు