దీపికా పదుకొనె ఐడీ అడిగిన సెక్యూరిటీ...దీపికా రియాక్షన్ ఏంటో తెలుసా!

ఒక ఫెమస్ వ్యక్తి ఎయిర్ పోర్ట్ లోకి అడుగుపెట్టగానే అందరూ గుర్తించాలి అని కోరుకుంటూ ఉంటారు.ఒకవేళ వారిని గుర్తుపట్టకుండా వారి గుర్తింపు కార్డు సెక్యూరిటీ అడిగిందో ఇక అంతే, మీడియా లో ఆయనకు అవమానం జరిగింది,ఈమెకు అవమానం జరిగింది అంటూ దుమ్మెత్తి పోస్తుంది.

 Deepika Padukone Reaction To Airport Security Guard Asking For Id-TeluguStop.com

కానీ ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనె విషయంలో కూడా ఒక అవమానం జరిగింది.కానీ దానిని ఆమె చాలా సింపుల్ గా తీసుకోవడం ఇప్పుడు నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది.

వివరాల్లోకి వెళితే…ముంబై ఎయిర్ పోర్ట్ లో దీపికా పదుకొనె వెళుతున్న సమయంలో ఎయిర్ పోర్ట్ ఎంట్రీ ఇవ్వగానే అక్కడ ఉన్న సెక్యూరిటీ ఆమెను ఐడీ కార్డు చూపించమని కోరాడు.అయితే పక్కనున్న వ్యక్తి దీపికా పదుకొనె అంటూ ఐడీ కార్డు చూపించకుండా ముందుకు వెళ్లిపోగా, దీపికా మాత్రం వెనక్కి వచ్చిమరీ ఐడీ ఉంది కావాలా అంటూ మర్యాదగా సెక్యూరిటీ ని అడిగి, తన ఐడీ కార్డును చూపించి మరి లోనికి వెళ్ళింది.

ఇప్పుడు దీనికి సంబందించిన వీడియో ఒకటి బయటకు రావడం తో ఇప్పుడు ఆ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా దీపికా సింపుల్ సిటీ కి మరోసారి ఫిదా అయిపోతున్నారు.

దీపికా పదుకొనె ఐడీ అడిగిన సెక�

తనను ఐడీ అడిగారు అన్న చిరాకు గాని, అసహనం కానీ వ్యక్తం చేయకుండా సెక్యూరిటీ సిబ్బందికి గౌరవం ఇచ్చి మరి తన ఐడీ చూపించడం నెటిజన్లు దీపికను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు.బాలీవుడ్ లో దీపికా పదుకొనె ప్రస్తుతం నెంబర్ వన్ హీరోయిన్ గా దూసుకుపోతున్నారు.అలాంటి వ్యక్తి కూడా ఐడీ కార్డు చూపించమనగానే సెక్యూరిటీ కి చూపించి ఒక సాధారణ వ్యక్తిగా ప్రవర్తించిన దీపిక పై నెటిజన్లు ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube