టెన్త్ పరీక్షా పేపర్ లీక్ వ్యవహారంలో అరెస్ట్ అయి బెయిల్ పై వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు జాతీయ నాయకత్వం మద్ధతు తెలుపుతుంది.ఈ క్రమంలోనే జాతీయ నేతలు ఫోన్ చేసి బండి సంజయ్ ను పరామర్శిస్తున్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, స్మృతి ఇరానీ, తరుణ్ చుగ్ తో పాటు సునీల్ బన్సల్ లు బండి సంజయ్ ను పరామర్శించి, జాతీయ నాయకత్వం ఉండగా ఉంటుందని హామీ ఇచ్చారని తెలుస్తోంది.బీఆర్ఎస్ కుట్రలను చేధిస్తూ ప్రజా సమస్యలపై పోరాడాలని సూచించారని సమాచారం.
మరోవైపు హైదరాబాద్ లో పార్టీ ముఖ్య నేతలు సమావేశం అయ్యారు.బండి సంజయ్ అరెస్ట్, విడుదల అంశాలను వారు చర్చిస్తున్నట్లు సమాచారం.







