తెలుగు రాష్ట్రాలలో( Telugu States ) ఎండలు దంచేస్తున్నాయి.సూర్యుడు భగభగ మండిపోతున్నాడు.
ఉదయం 9 గంటలు కాకముందే ప్రజలు ఇంటి నుండి బయటకు అడుగు వేయటానికి భయపడే పరిస్థితి నెలకొంది.ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి.
జూన్ నెల మొదటి తారీకు గురువారం చూస్తే భయంకరమైన ఉక్క పూతతో ప్రజలు అల్లాడిపోయారు.పరిస్థితి ఇలా ఉంటే రాబోయే ఐదు రోజులలో ఏపీలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
శుక్రవారం 32 మండలాలలో వడగాడ్పుల ప్రభావం ఉండబోతుందని తెలిపింది.
అనకాపల్లి జిల్లాలో బుచ్చయ్య పేట, చోడవరం, కె.కోటపాడు, కాసింకోట, కోటవురట్ల, మక్కవరపాలెం, నర్సీపట్నం, నాతవరం, సబ్బవరం మండలాలు ఇంకా కాకినాడ జిల్లాలో కోటనందూరు, తుని మండలాలు ఇంకా విజయనగరం జిల్లాలో కొత్తవలస మండలాలు విశాఖలోని పద్మనాభ మండలంలోని వడగాడ్పుల తీవ్రత ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేయడం జరిగింది.ఈ క్రమంలో ఎండల తీవ్రత దృష్ట్యా ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇదిలా ఉంటే జూన్ 4 లేదా 5వ తారీఖు కేరళలో నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని రెండో వారంలో రెండు తెలుగు రాష్ట్రాలకు వ్యాపించనున్నాయని వాతావరణ శాఖ అధికారులు ( Weather Report )తెలియజేస్తున్నారు.