మృణాల్ చూపులతోనే కవ్విస్తుందిగా.. 'హాయ్ నాన్న' పోస్టర్ వైరల్!

మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ).ఈ బ్యూటీ ఒకే ఒక్క సినిమాతో ఇక్కడ బాగా పాపులర్ అయ్యింది.

 'hi Nanna' Team Releases Poster Of Mrunal Thakur, Hi Nanna, Nani, Viral, Megast-TeluguStop.com

నార్త్ హీరోయిన్ అయినప్పటికీ ఈమె ఇక్కడ ఒక్క సినిమా తోనే అందరిని తన వైపుకు తిప్పుకుంది.సీతారామం( Sita Ramam ) అనే హిట్ తో ఈ భామ సౌత్ లో మోస్ట్ పాపులర్ హీరోయిన్ అయిపోయింది.

సీతారామం సినిమాలో సీత పాత్రలో నటించిన ఈ అమ్మడి నటనకు అంతా ఫిదా అయ్యారు.

Telugu Nannareleases, Nanna, Chiranjeevi, Mrunal Thakur, Nani, Shouryuv, Sita Ra

ఇక ఒక్క సినిమాతో ఇక్కడ ఫేమస్ అయిపోయిన ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వరిస్తున్నాయి.ఇదిలా ఉండగా ఈ రోజు ఈ భామ పుట్టిన రోజు జరుపు కుంటుంది.ఈ క్రమంలోనే ఈమె నటిస్తున్న తెలుగు మూవీ నుండి ఇంట్రెస్టింగ్ అండ్ ఆసక్తికర పోస్టర్ వచ్చింది.

ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అయ్యింది.అమ్మడి బర్త్ డే కు ట్రీట్ ఈ రూపంలో ఇచ్చారు.ప్రజెంట్ మృణాల్ నాని సరసన ఒక సినిమా చేస్తుంది.”హాయ్ నాన్న’( Hi Nanna )’ అనే సినిమాలో ఈ జంట కలిసి నటిస్తున్నారు.నాని కెరీర్ లో బెంచ్ మార్క్ సినిమా 30వ ప్రాజెక్ట్ గా రాబోతున్న హాయ్ నాన్న సినిమాను కొత్త డైరెక్టర్ శౌర్యన్ తెరకెక్కిస్తుండగా ఈ సినిమా నుండి ఇటీవలే టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేసారు మేకర్స్.దీనికి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.

Telugu Nannareleases, Nanna, Chiranjeevi, Mrunal Thakur, Nani, Shouryuv, Sita Ra

ఓన్లీ టైటిల్ గ్లింప్స్ తో అంచనాలు హై లెవల్లో పెరిగి పోయాయి.ఇక ఈ సినిమా నుండి ఈ రోజు మృణాల్ పుట్టిన రోజు కానుకగా పోస్టర్ రిలీజ్ చేసారు.పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ వదిలిన ఈ పోస్టర్ బాగా ఆకట్టు కుంటుంది.మృణాల్ అదిరిపోయే లుక్ లో అందంగా కనిపిస్తుంది.ఇక బ్యాక్గ్రౌండ్ లో నాని కూడా ఉన్నారు.ఇక వైరా ఎంటెర్టైనమెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్నాడు.

డిసెంబర్ 21న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube