నేచురల్ స్టార్ నాని( Nani ) మరోసారి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.ఆయన తాజాగా హాయ్ నాన్న సినిమా( Hi Nanna ) తో కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు తేల్చేశారు.
హీరోయిన్ గా ఈ సినిమా లో మృణాల్ ఠాకూర్ నటించిన విషయం తెల్సిందే.ప్రస్తుతం సినిమా కు సంబంధించిన వసూళ్ల గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఇప్పటికే ఓవర్సీస్ లో ఈ సినిమా మిలియన్ డాలర్ల వసూళ్లు క్రాస్ చేసింది.అక్కడ అత్యధిక మిలియన్ డాలర్ల వసూళ్ల చిత్రాలు ఉన్న హీరో గా నాని మరో అడుగు ముందు వేశాడు.మహేష్ బాబు రికార్డు ను సమం చేయడం తో పాటు మరింత ముందుకు దూసుకు పోతూ రెండు మిలియన్ ల వసూళ్ల దిశగా దూసుకు పోతుంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో యానిమల్ సినిమా( Animal ) ప్రభావం ఉన్నా కూడా హాయ్ నాన్న కి మంచి షేర్ దక్కుతూనే ఉంది.మొన్న వీకెండ్ కి హాయ్ నాన్న వసూళ్లు భారీ గా నమోదు అయ్యాయి.అంతే కాకుండా మరో వీకెండ్ లో కూడా సినిమా కి సాలిడ్ వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటూ ఉన్నారు.
మొత్తానికి నాని హాయ్ నాన్న సినిమా తో గట్టి హిట్ కొట్టాడు అంటున్నారు.ఇక హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మొదటి సినిమా సీతారామం తో హిట్ కొడితే ఇప్పుడు మళ్లీ ఈ సినిమా తో ద్వితీయ సక్సెస్ ను దక్కించుకుంది.
సాధారణంగా హీరోయిన్స్ కి ద్వితీయ విఘ్నం ఉంటుంది.కానీ మృణాల్ ఆ ద్వితీయ విఘ్నం ను క్రాస్ చేసింది.దాంతో అభిమానులతో పాటు అన్ని వర్గాల వారు కూడా ఈ సినిమా లోని ఆమె సక్సెస్ ను అభినందిస్తూ ఆమె అందంను ఆస్వాదిస్తూ ఉన్నారు.