హీరోలకిచ్చే మర్యాద హీరోయిన్లకు ఇవ్వరు.. తమన్నా సంచలన వ్యాఖ్యలు?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపుగా రెండు దశాబ్దాల నుంచి స్టార్ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తున్న హీరోయిన్లలో తమన్నా ఒకరు.తెలుగులో దాదాపుగా అందరు స్టార్ హీరోలకు జోడీగా తమన్నా నటించారు.

 Heroines Not Getting Proper Recognisation In Film Industry Tamannah Details Here-TeluguStop.com

అయితే స్టార్స్ కు జోడీగా తమన్నా నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ కావడంతో ఆమెకు గతంతో పోలిస్తే సినిమా ఆఫర్లు తగ్గాయి.అయితే తాజాగా తమన్నా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం చాలామంది హీరోయిన్లు స్టార్ హీరోల సినిమాలలో పాటలకు మాత్రమే పరిమితమవుతున్నారు.తెలుగు సినిమాలలో చాలామంది హీరోయిన్లకు సరైన ప్రాధాన్యత ఉన్న పాత్రలు దక్కడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అయితే తాజాగా తమన్నా సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీలో చాలా అసమానతలు జరుగుతాయని తమన్నా కామెంట్లు చేశారు.

వీటి గురించి మహిళలు పెద్దగా పట్టించుకోవడం లేదని తమన్నా వెల్లడించారు.తాను నటించిన సినిమాలలో ఏ అంశం గురించి అయినా మాట్లాడితే వారు దానిని సీరియస్ గా తీసుకునేవారు కాదని తమన్నా అన్నారు.

ఆ తర్వాత నా అభిప్రాయం కరెక్టా? కాదా? అని నాకు నేను పునః పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తమన్నా కామెంట్లు చేశారు.సినిమా రంగంలో మహిళలకు మర్యాద లేదని తమన్నా చెప్పుకొచ్చారు.

ఒకానొక టైమ్ లో తాను హీరోలను ప్రేమించే రోల్స్ కు పరిమితమయ్యానని తమన్నా అన్నారు.

Telugu Gopichand, Characters, Maestro, Nithin, Seetimar, Tamannah-Movie

అయితే గతంతో పోల్చి చూస్తే ఇప్పుడు పరిస్థితి మారుతోందని తమన్నా పేర్కొన్నారు.హీరోలకు ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ ఇస్తున్నారని హీరోయిన్లకు ఇవ్వడం లేదని తమన్నా అన్నారు.నిర్మాతల నుంచి రెమ్యునరేషన్ ను పొందుతున్నామని అయితే తగిన గుర్తింపును మాత్రం పొందలేకపోతున్నామని తమన్నా చెప్పుకొచ్చారు.

తమన్నా ఒకవైపు పెద్ద సినిమాలలో నటిస్తూనే మరోవైపు చిన్న సినిమాలలో నటిస్తుండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube